ఎందుకూ పనికి రాని హిట్టు

ఎందుకూ పనికి రాని హిట్టు

సినీ పరిశ్రమలో ఒక్క హిట్టొస్తే జాతకాలు మారిపోతాయని అంటుంటారు. కానీ అదంతా ఒట్టి భ్రమేనని, హిట్స్‌ వచ్చినా కానీ ఫేటు మారదని అంటూ తన కెరియర్‌నే ఉదహరిస్తోంది అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పెద్ద హిట్‌ సినిమాలో కీలక పాత్ర చేసిన అంజలికి ఆ సినిమా వల్ల కెరియర్‌ మలుపు తిరగలేదు. బలుపుతో మరో హిట్‌ కైవసం చేసుకున్నా అంజలికి అవకాశాలు పెరగలేదు. 'గీతాంజలి'తో సోలోగా సూపర్‌హిట్‌ కొట్టినా కానీ అంజలి కెరియర్‌కి ఊపు రాలేదు. గీతాంజలి తర్వాత అంజలి సూపర్‌ బిజీ అయిపోతుందని, ఇకపై వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసేస్తారని అనుకున్నారు. కానీ తన పర్సనల్‌ స్టాఫ్‌ని మెయింటైన్‌ చేయడానికి తగ్గ డబ్బులు కూడా తనకి రానంతగా అంజలి ఖాళీ అయిపోయింది. కొత్తగా ఆఫర్లేమీ రాక తిరిగి తమిళనాడుకి మకాం మార్చేసింది. తెలుగు చిత్ర సీమలో తెలుగు హీరోయిన్లకి డిమాండ్‌ ఉండదని మరోసారి తేలిపోయింది. గీతాంజలి పెద్ద హిట్‌ అయినా కానీ తనవరకు ఎందుకూ పనికి రాకుండా పోయింది. తమిళంలో ఓ మోస్తరు బిజీగా ఉన్న దశలో తెలుగు సినిమాలపై కన్ను వేసినందుకు అంజలి ఇప్పుడు ఫీలవుతోంది. కోలీవుడ్‌లోనే కంటిన్యూ అవుతానంటూ చెన్నయ్‌ చెక్కేసింది. అయితే ఇదంతా అంజలి స్వయంకృతమని... తనతో సినిమా తీస్తే సకాలంలో పూర్తి చేయగలమనే ధీమాని నిర్మాతలకి ఆమె ఇవ్వలేకపోయిందని, పర్సనల్‌ సమస్యలతో నిర్మాతలని టెన్షన్‌ పెట్టడం వల్లే ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయని ఓ వాదన వినిపిస్తోంది. అదీ నిజమే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English