'సైకో' వెనుక పెద్ద స్టోరీయే ఉంది!

'సైకో' వెనుక పెద్ద స్టోరీయే ఉంది!

ఏ చెత్త టాపిక్ దొరికినా సినిమా తీసేయాలనుకునే దర్శకుడు అంటూ వర్మ మీద ఓ దురభిప్రాయం ఏర్పడిపోయింది జనంలో. అందుకే అతడి సినిమాలకు క్రేజ్ తగ్గింది. దర్శకుడిగా అతడి మీద ఉన్న గౌరవమూ తగ్గింది. అయినా ఏమాత్రం మొహమాటపడకుండా, ఎదుటివాళ్ల మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన స్టయిల్లో తను సాగిపోతుంటాడు వర్మ. అయితే తన సైకో సినిమాని మాత్రం అన్ని సినిమాలనూ చూసిన దృష్టితో చూడవద్దని మొదటిసారి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతగాడు కొన్ని సినిమాలు డబ్బు కోసం, ఇంకొన్ని సినిమాలు పేరు కోసం, మరికొన్ని సినిమాలు సరదా కోసం తీశాడట. కానీ ఈ సినిమాని అలా తీయలేదట.

తనకు తెలిసిన ఓ అమ్మాయి జీవితంలో ఎదురైన భయంకర సంఘటనను చూసి, కలతచెంది, ఆ బాధతో తీశాడట. అందుకే ఇది తన ఇతర సినిమాల్లాంటిది కాదు అని నొక్కి వక్కాణిస్తున్నాడు. అందరూ అంటున్నదేమిటంటే, అతడు చెబుతోన్న ఆ అమ్మాయి కంగనా రనౌత్ చెల్లెలు అని. ఆమె ఓ సైకో ప్రేమికుడి చేతిలో యాసిడ్ దాడికి గురయ్యింది. ఎన్నో బాధలు పడింది. అది తెలియగానే సైకో సినిమాకి వర్మ శ్రీకారం చుట్టాడని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ, మామూలు సినిమాల్లోనే ఎమోషన్స్ ని మితిమీరి చూపిస్తాడు మనోడు. ఇక ఇంత ఫీలయ్యి తీశాడంటే ఏ రేంజ్ లో చూపించి ఉంటాడో ఏమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు