టాలీవుడ్‌ కన్ను ఆ సిటీపై పడింది

టాలీవుడ్‌ కన్ను ఆ సిటీపై పడింది

తెలుగు సినిమాకు మహరాజ పోషకులు సీమాంధ్రులు. ఐతే సినిమా పరిశ్రమ కొలువు దీరిన హైదరాబాద్‌ వాళ్లకు కాకుండా పోయింది. అలాగని సీమాంధ్రుల కోసం ఇండస్ట్రీని ఆ ప్రాంతానికి తరలించలేని పరిస్థితి. ఇక్కడి సౌకర్యాల కారణంగా హైదరాబాద్‌లోనే ఉండాలి. మరి ఈ పరిస్థితుల్లో సీమాంధ్రుల్ని ఎలా ఆకట్టుకోవాలని చూస్తున్న తరుణంలో దర్శక నిర్మాతల్ని విజయవాడ రారమ్మని పిలుస్తోంది. సీమాంధ్రకు రాజధాని కాబోతున్న విజయవాడను రకరకాల ఫంక్షన్ల కోసం వేదికగా చేసుకుంటున్నారు టాలీవుడ్‌ ఫిలిం మేకర్స్‌.

ఆ మధ్య లౌక్యం ఆడియోతో పాటు విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహిస్తే జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో విజయోత్సవానికి కూడా విజయవాడే వేదిక అయింది. ఇప్పుడు మరో తెలుగు సినిమా ఆడియో ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌కు విజయవాడను కేంద్రంగా చేసుకుంది. నారా రోహిత్‌ హీరోగా నటించిన 'రౌడీ ఫెలో' ఆడియో విజయోత్సవాన్ని శనివారం నాడు విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. మరికొన్ని సినిమాల ఫంక్షన్లకు కూడా విజయవాడ వేదికగా నిలుస్తోంది. ఎన్నడూ లేనిది తమ దగ్గర ఫంక్షన్లు చేస్తుండటం, సినిమా తారల్ని  దగ్గర్నుంచి చూసే అవకాశం లభిస్తుండటంతో జనాల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. భారీగా తరలి వస్తూ ఈ ఫంక్షన్లను విజయవంతం చేస్తున్నారు. మున్ముందు విజయవాడ మరింతగా సినీ జనాల్ని ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు