శింబు బాధితులు ఏమంటున్నారంటే..

శింబు బాధితులు ఏమంటున్నారంటే..

కోలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ ఎవరంటే శిలంబరసన్‌ అలియాస్‌ శింబు అని చెబుతారు ఎవరైనా. మొదట నయన్‌తో, ఆ తర్వాత హన్సికతో సీరియస్‌గా ప్రేమాయణం నడిపాడు శింబు. ఆయా సమయాల్లో ఈ ఇద్దరితోనూ పెళ్లి పీటల దాకా వెళ్లినట్లే కనిపించాడు శింబు. కానీ ఇద్దరూ అతణ్ని భరించలేక దూరంగా వెళ్లిపోయారు. నయనతార శింబుతో విడిపోయాక ప్రభుదేవాతో జతకట్టింది కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. హన్సిక మాత్రం బుద్ధిగా సినిమాలకే పరిమితమైంది. ఈ మధ్య నయన్‌ని, హన్సికను తమ లవ్‌స్టోరీల గురించి అడిగితే.. ఎవరి పేర్లూ ఎత్తకుండా తమ బ్రేకప్‌ బాధను పంచుకున్నారు.

''జీవితంలో ప్రేమించిన వాళ్లకు దూరమవడం కంటే పెద్ద బాధ ఇంకేదీ ఉండదు. నేనా బాధను ఒకటికి రెండుసార్లు అనుభవించా. ఈ పరిస్థితి జీవితాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. తొలిసారి ప్రేమలో విఫలమైనపుడు ఎంతో బాధపడ్డా. ఐతే నా కెరీర్‌, స్టేటస్‌ ప్రకారం అదే పనిగా బాధపడటంలో అర్థం లేదని దాన్నుంచి బయటికి వచ్చా. రెండోసారి కూడా ప్రేమ విఫలమయ్యాక.. ఇక ప్రేమ గురించే మాట్లాడలేని స్థితిలో ఉన్నా'' అని చెప్పింది నయన్‌.

ఇక హన్సికను కదిలిస్తే.. ''ఫెయిల్‌ అవ్వాలని ఎవరరూ ప్రేమలో పడరు. ఎవర్ని ప్రేమించినా జీవితాంతం కలిసుండాలనే అనుకుంటాం. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవని నేను ఇష్టపడ్డ వ్యక్తికి దూరమయ్యాకే తెలిసింది. ఆ విషయంలో బాధపడట్లేదని చెప్పను. కానీ వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. నేను దత్తత తీసుకున్న పిల్లలతో కలిసుంటే నాకా బాధే తెలియదు. ఇక సినిమాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రేమ బాధ నుంచి బయటపడ్డానికి నేను చెప్పే మంచి సలహా.. పీకల్లోతు పనుల్లో పడిపోమనే'' అని చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు