ఇక భయపెట్టడం మానవా బాబు?

ఇక భయపెట్టడం మానవా బాబు?

అయితే మాంచి లవ్‌స్టోరీ తీస్తాడు.. లేకపోతే ఒక థ్రిల్లరో, హర్రరో తీస్తాడు.. కాకపోతే రెండిరటిలోనూ కామన్‌గా భయపెడుతూనే ఉంటాడు. ఇదండీ మన రవిబాబు వరస. అల్లరి, సోగ్గాడు, మనసారా, నువ్విలా వంటి లవ్‌ స్టోరీలను తీసిన ఈ క్రియేటివ్‌ గయ్‌, అనసూయ, అమరావతి, అవును వంటి థ్రిల్లర్స్‌ కూడా రూపొందించాడు. ఈ సినిమాలన్నింటిలోనూ విలన్లు ఎప్పుడు హీరోనో హీరోయిన్‌నో భయపెడుతూనే ఉంటారు. ఇక ‘అవును’ అనేది హారర్‌ సినిమా కాబట్టి అది టాపులేపేసేలా జనాలను భయపెట్టేసింది.

ఇప్పుడు తాజాగా మళ్ళీ భయపెట్టాడానికి వచ్చేశాడు రవిబాబు. అప్పట్లో ‘అవును’ సినిమా తీసినప్పుడు జనాలకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. స్టోరీలో చాలా లీడ్స్‌ అలా ఆన్సర్‌ లేకుండా మిగిలిపోయాయట. వాటన్నింటికీ ఆన్సర్‌ చెప్తానంటూ మళ్ళీ హీరోయిన్‌ పూర్ణ (షామ్నా ఖాసిం)తో సీక్వెల్‌ తీశాడు. ‘అవును 2’గా వస్తున్న ఈ సినిమా ధియేట్రికల్‌ ట్రైలర్‌ను చూస్తే మాత్రం మనకు భయంవేయాల్సిందే. ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ట్రైలర్‌లో అప్పటివరకు అంతా శాంతంగా ఉండి, ఆఖరిలో దెయ్యం అరిపిస్తుంది. ఇక ట్రైలర్‌లోనే ఇలా భయపెడితే, సినిమాలో ఏం చేస్తాడో... అయినా ఎన్నాళ్ళు ఇలా భయపెడతావ్‌ బాసూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English