బ్రేక్‌ తీసుకున్న 'ఐటెమ్‌' రాజా

బ్రేక్‌ తీసుకున్న 'ఐటెమ్‌' రాజా

ఎవరైనా ఒకటి చేయడం సిద్ధహస్తుడని తేలితే ఇక అదే తమకీ కావాలంటూ అంతా అతని వెంట పడిపోతారు. తెలుగు చిత్ర సీమలో ఇప్పుడున్న సంగీత దర్శకులలో ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడంలో నిష్ణాతుడు అనిపించుకున్న దేవిశ్రీప్రసాద్‌ ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.

వరసపెట్టి సూపర్‌ ఐటెమ్‌ సాంగులు కంపోజ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌తో ప్రతి సినిమాలోను ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేయించుకోవడానికి చూస్తున్నారు. డమరుకం చిత్రంలో అసలు ఐటెమ్‌ సాంగ్‌కి స్కోప్‌ లేదు. కానీ ఆ సినిమాలో అలాంటి ఓ పాట కావాలంటూ నాగార్జున పట్టు బట్టి 'చాయ్‌' సాంగ్‌ చేయించుకున్నారు. అలాగే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్‌తో చేస్తున్నవారంతా అతడిని అవే కావాలంటూ వాయించేస్తున్నారు.

కొందరు దర్శకులైతే క్యాచీ పదాలు తామే కాయిన్‌ చేసి దానిపై ఓ పాట కట్టేయమని అడుగుతున్నారు. అలాంటిది దేవిశ్రీప్రసాద్‌ చేసిన రీసెంట్‌ ఆడియోలు మిర్చి, ఇద్దరమ్మాయిలతో రెండిట్లోను ఐటెమ్‌ సాంగులు లేవు. అలాగే ఆమధ్య వచ్చిన జులాయి ఆడియోలో ఐటెమ్‌ సాంగ్‌ పెట్టుకోలేదు. కాకపోతే మిర్చిలో డార్లింగే, ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్‌ లేసిపోద్ది పాటలతో ఐటెమ్‌ సాంగ్‌ లేని లోటుని దేవి కొంతవరకు తీర్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు