మహేష్‌ బాబు దేనిని వదలడా?

మహేష్‌ బాబు దేనిని వదలడా?

ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో అని మహేష్‌బాబు గురించి చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా మహేష్‌బాబు మార్కెట్‌ చాలా పెరిగిపోవడంతో నిర్మాతలు అతనికి ఎంతయినా ఇచ్చేయడానికి సిద్ధమైపోతున్నారు. సినీ రంగంలో ఇంత సంపాదిస్తున్నా కానీ మహేష్‌ యాడ్‌ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.

ఇప్పటికే టాలీవుడ్‌ హీరోల్లో అత్యధిక బ్రాండ్స్‌తో డీల్‌ పెట్టుకున్నవాడిగా మహేష్‌బాబుకి పేరుంది. పదికి పైగా బ్రాండ్స్‌కి అతను అంబాసిడర్‌గా ఉన్నాడు. అయినా కానీ మహేష్‌ సంతృప్తి పడడం లేదు. ప్రతి ప్రోడక్ట్‌లోను ఒక్కో దానితో ఒప్పందం చేసుకుని కోట్లు వెనకేసుకుంటున్నాడు.ఈ క్రమంలో మహేష్‌ కొన్ని సూత్రాలని కూడా పాటించడం లేదు. షాపింగ్‌ మాల్స్‌కి సాధారణంగా హీరోయిన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఉండడం రివాజు. కానీ ఓ షాపింగ్‌ మాల్‌తో డీల్‌ కుదుర్చుకున్న మహేష్‌ ఆ బ్యారియర్‌ బ్రేక్‌ చేసేసాడు.

సంతూర్‌ సోప్‌కి మహేష్‌ ప్రచారం చేయడమే వింతగా చెప్పుకున్నారు. అయితే నగల దుకాణాలకి హీరోలు ప్రచారం చేసినప్పుడూ ఇలాగే ముక్కున వేలేసుకున్నారు కానీ అదే ఇప్పుడు ట్రెండ్‌ అయిపోయింది. డిమాండ్‌ ఉన్నప్పుడు, డబ్బులు వస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు వదులుకోవాలి? అదేం తప్పు కాదుగా!