మంచు లక్ష్మి సడెన్ గా ఎంటరయ్యిందేం?

మంచు లక్ష్మి సడెన్ గా ఎంటరయ్యిందేం?

మంచు వారి ఫ్యామిలీ అంతా కలిసి ఓ భారీ సినిమాని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా! మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు ఇంతవరకూ ఒక తెర మీద కనిపించలేదు కాబట్టి, ఈ సినిమా మీద జనానికి ఆసక్తి కూడా ఏర్పడింది. అయితే ఇప్పడు లక్ష్మీప్రసన్న కూడా ఇందులో నటిస్తోందని అంటున్నారు. మొన్నటివరకూ లేనిది, ఇంత సడెన్ గా ఆమెనెందుకు దించారో ఎవరికీ అర్థం కావడం లేదు.నిర్మాతగా కెరీర్ ప్రారంభించినా, నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది లక్ష్మి.అలాంటిది ఆమెనెందుకు తీసుకోలేదు, తండ్రీకొడుకులు మాత్రమే ఎందుకు నటిస్తున్నారు అన్న సందేహం మొదట్లోనే వచ్చింది. అదే అడిగితే, ఆమె ఓ ఇంగ్లీషు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఇక్కడ చేయలేని పరిస్థితి అని చెప్పాడు కలెక్షన్ కింగ్. అంతా నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడేమో సడెన్ గా లక్ష్మి కూడా చేస్తోంది అని ప్రకటించేశారు.

విషయమేంటా అని తీగ లాగితే డొంక కదిలింది. లక్ష్మి నటించకపోవడం వల్ల నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటున్నారట. వారి కుటుంబంలో ఏవో సమస్యలు వచ్చాయని, అవి తారస్థాయికి చేరడంతో లక్ష్మి వీరికి దూరమయ్యిందని, అందువల్లే ఆమె ఈ సినిమాలో లేదని చెవులు కొరుక్కుంటున్నారట. ఈ విషయం మోహన్ బాబు చెవిన కూడా పడటంతో పరువు పోతోందని భయపడి, లక్ష్మితో మాట్లాడి వెంటనే రప్పించాడట. ఆమె కోసం ఓ పాత్రను సృష్టించమని డైరెక్టర్ తో చెప్పారట. అతడు పాపం స్ర్కిప్టు మొత్తం మార్పులు చేసుకుని, మేడమ్ గారి కోసం ఓ రోల్ క్రియేట్ చేశాడట. అదీ సంగతి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు