అతడికీ హీరోయిన్లు కరువయ్యారా?

అతడికీ హీరోయిన్లు కరువయ్యారా?

బాలయ్యకు హీరోయిన్లు దొరకడం లేదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్... అన్నీ గాలించినా అతడి పక్కన చేయడానికి అమ్మాయి దొరకలేదు. దాంతో హీరోయిన్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే కమల్ హాసన్ కి కూడా వచ్చిందా అని కోలీవుడ్లో కొందరు గుసగుసలాడుకుంటున్నారు తెలుసా! కమల్ తో లింగుస్వామి ఉత్తమ విలన్ అనే కామెడీ ఎంటర్ టైనర్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నటించమని కాజల్ ని అడిగితే నో అంది. లిప్ లాకులకు భయపడిందో, రెమ్యునరేషన్ సరిపోదనుకుందో తెలియదు కానీ చేయను ససేమిరా అంటూ సారీ చెప్పేసింది.

అంతే, వెంటనే కన్నడ నటి రమ్యని, ఎవరూ గుర్తే పట్టని లేఖా వాషింగ్టన్ ని తెచ్చి హీరోయిన్లుగా పెట్టేశారు. పెట్టడంతో తప్పయితే లేదు. రమ్య కన్నడలో బాగా ఫేమస్. కానీ తమిళులు ఇష్టపడాలి కదా! గతంలో ఈమె తెలుగులో కళ్యాణ్ రామ్ తో కూడా నటించింది. అయినా మన తెలుగు వాళ్లు ఆమెను గుర్తు పడతారని అనుకోలేం. ఇష్టపడతారని అంతకన్నా అనుకోలేం. ఇక లేఖా వాషింగ్టన్ ఎవరికీ సరిగ్గా తెలియనే తెలియదు. వేదం సినిమాలో మనోజ్ కి జంటగా నటించిన ఈ పిల్ల మనోళ్లకే గుర్తు లేదు. ఇలాంటి హీరోయిన్లని తెచ్చి కమల్ పక్కన ఎలా పెట్టేశారో అర్థం కావడం లేదు. కాజల్ నో అంది సరే. మిగతావాళ్లు కూడా అలాగే అన్నారా? లేకపోతే ఇంత కంగారుగా నేమ్, ఫేమ్ లేనివాళ్లని తెచ్చి అంత పెద్ద హీరో పక్కన ఎలా పెట్టేస్తారు అన్నదే అందరి సందేహం. లింగుస్వామిని అడిగితే ఏమంటాడో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు