అది సునీల్ లేని లోటేనంటున్నారు...!

అది సునీల్ లేని లోటేనంటున్నారు...!

ఒకవైపు తడాఖా హిట్ తో సునీల్ మంచి స్వింగు మీదకు వచ్చాడు. ఇన్ని రోజులూ సునీల్ హీరోగా ప్రతిపాదన దశలో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు సెట్స్ మీదకు ఎక్కుతున్నాయి. దీంతో మళ్లీ అతడు ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే సునీల్ హీరోగా బిజీ అయిపోయినా అతడి లోటు చిత్ర పరిశ్రమను పట్టి వేధిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలకు లోటు లేదు కానీ కామెడియన్లకు లోటే! ఏదో ఒకటీ రెండు ప్రయత్నాలతో సునీల్ ఆగిపోతాడు అనుకుంటే... అతడు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఏదో విధంగా హీరోగానే సెటిల్అయిపోవాలని ఆయన ఫిక్సయినట్టు ఉన్నాడు. అది ఆయన వ్యక్తిగత అభిష్టం అనుకుంటే..ఇప్పుడు సునీల్ లేని లోటు మాత్రం తెరపై కనిపిస్తోందని అంటున్నారు.

హీరోలకు, హీరోయిన్లకు సైడ్్ కిక్ రోల్స్ సరిగా చేసేవారు ఇప్పుడు లేకుండా పోయారు. ఉదాహరణకు  సిద్ధార్థ్ 'సమ్్థింగ్ సమ్్థింగ్' సినిమాతో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో బ్రహ్మానందం చేసిన పాత్ర తమిళంలో సంతానం చేశాడు. ఇతడు ఈ రోల్ కు హీరో పక్కన చక్కగా అమరాడు. అయితే బ్రహ్మీ వయసుకు ఈ క్యారెక్టర్ కు పొంతన కుదరలేదు. బ్రహ్మానందం సరిగా చేయలేదు అనలేం కానీ.. బ్రహ్మానందం కన్నా తక్కువ వయసు వారు చేయాల్సిన పాత్ర ఇది. తమిళంలో ఈ సాత్రకు సంతానం ను ఎంచుకోవడమే రుజువు. తెలుగులో సునీల్లాంటి కామెడియన్ ఈ పాత్రను చక్కగా డీల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆయన హీరోగా బిజీ అయిపోయారు. ఇక శ్రీనివాసరెడ్డి, అలీ వంటి వారు ఒక మూసలో పడిపోయారు. కామెడియన్ మీద సెటైర్లు వేస్తూ కామెడీ చేయడమే వారి డ్యూటీ అయిపోయింది. వారు ఈ మాత్రం బరువైన పాత్రలు చేసే స్థాయిలో ప్రస్తుతానికి లేరు! దీంతో ఓవరాల్ గా సునీల్ లేని లోటు అయితే కనిపిస్తోంది. మరి దీన్ని భర్తీ చేసేది ఎవరో! ఎప్పుడో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు