గోవిందుడు ఆన్‌ ట్రాక్‌

గోవిందుడు ఆన్‌ ట్రాక్‌

    అక్టోబర్‌ 1న 'గోవిందుడు అందరివాడేలే' రిలీజ్‌కి సకల సన్నాహాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఇంకా చాలా షూటింగ్‌ జరగాల్సి ఉందని రిపోర్టులు వచ్చాయి. కానీ ఈ చిత్ర బృందం పట్టుబట్టి సినిమాని రెడీ చేసేసాయి. ఈ నెల 25న సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్‌ 1న రిలీజ్‌ అయితే 2, 3 తేదీల్లో పబ్లిక్‌ హాలీడేస్‌ కావడంతో తొలి వీకెండ్‌ వసూళ్లు అదిరిపోతాయని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ్యామిలీ సినిమా కావడం, దసరా పండక్కి రావడం దీనికి కలిసి వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం కోసం చరణ్‌ రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఎలాగైనా డెడ్‌లైన్‌ మీట్‌ అవ్వాలని రాత్రి పూట డబ్బింగ్‌ పూర్తి చేసి పగలంతా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చాడు. యువన్‌ శంకర్‌ రాజా ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పని కూడా పూర్తి చేసి ఇచ్చేసాడట. సో.. గోవిందుడు అక్టోబర్‌ 1న రావడం తథ్యం. ఇక ఎంత వరకు సందడి చేస్తాడనేదే తేలాల్సి ఉంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English