సమంతపై అందరికీ సానుభూతే...!

సమంతపై అందరికీ సానుభూతే...!

సిద్ధార్థ్ సమంత జీవితంలోకి వచ్చాక ఆమె పాత స్నేహితులకు, వారి స్నేహాలకు సమంత గుడ్ బై చెప్పేసిందట! ముందొచ్చిన చెవుల కన్నా, వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా ఎన్నో సంవత్సరాల పరిచయాలను కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం వదిలేసుకుందట సమంత! ఎంత లవ్వర్ కమ్ బాయ్ ఫ్రెండ్ జీవితంలోకి ఎంటరైతే ఇలా పాత స్నేహాలను ఎందుకు వదులు కోవడం? అంటే సమంత వారికి ఘాటైన సమాధానం చెప్పిందట. మీరు నా పర్సనల్ లైఫ్ గురించి, సిద్దూతో నా స్నేహం గురించి మీడియాకు లీకులు ఇస్తున్నారు. అసలు సిద్దూతో నా లవ్ గురించి మీడియాకు లీక్ చేసిందే మీరు ..అని సమంత విరుచుకుపడుతోందట!

ఇదిలా ఉంటే... సమంత విషయంలో ఇప్పుడు అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు మంచి కెరీర్ ఉన్న సమయంలో ఈ ప్రేమ ఏమిటో తమకు అర్థః కావడం లేదంటున్నారు. అది కూడా ఎవరైనా ఫ్రెష్ కుర్రాడు అయితే బావుంటుంది కానీ... ఇప్పటికే ఒక సారి పెళ్లి అయ్యి, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో వ్యవహారాన్ని నడిపిన సిద్దూలో సమంతకు ఏం నచ్చిందో ఏమో అని వారు తల పట్టుకుంటున్నారు! సమంత ఓకే చెబితే ఆమెను పెళ్లాడటానికి చాలా మంది వ్యాపార వేత్తలే రెడీగా ఉన్నారు. వారికి సిద్దార్థ్ కన్నా చాలా గొప్ప నేపథ్యం, పేరు ఉంది... కానీ సమంత కళ్లకు మాత్రం సిద్దార్థే బెస్ట్ గా కనిపించాడు! ఇప్పుడు ఎవరు సానుభూతి వ్యక్తం చేసినా అది సమంత కు పట్టకపోవచ్చు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు