'ఇద్దరమ్మాయిలతో'కి ఎలాంటి ఢోకా లేదు

'ఇద్దరమ్మాయిలతో'కి ఎలాంటి ఢోకా లేదు

సినిమా టికెట్‌ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇప్పుడు గ్రాస్‌ వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ టికెట్‌ ధరలు పెరిగిన తర్వాత రిలీజ్‌ అవుతున్న మొట్టమొదటి భారీ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. క్రేజ్‌ ఉన్న సినిమాకి ఓపెనింగ్స్‌ చాలా బాగుంటాయి కాబట్టి ఈ చిత్రం తొలి వారం వసూళ్లు ఘనంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

టికెట్‌ ధరల్లో గణనీయమైన పెరుగుదల వల్ల ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా నలభై కోట్ల మార్కుని అవలీలగా దాటిపోతుందని ట్రేడ్‌ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కొత్త టికెట్‌ ధరలతో ఎలాంటి అద్భుతాలు చూడవచ్చుననేది ఈ సినిమా ద్వారా ఒక హింట్‌ లభిస్తుంది.ఇక ఈ రేట్లతో మహేష్‌, పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లాంటి హీరోలైతే భారీ రికార్డులు సెట్‌ చేయగలరు.

ఏదేమైనా బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్న పూరి జగన్నాథ్‌కి 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని కమర్షియల్‌ సక్సెస్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. ట్రెయిలర్స్‌, సాంగ్స్‌ అన్నిటివల్ల పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి కాబట్టి ఇక 'ఇద్దరమ్మాయిలతో' జోరు చూడడమే తరువాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు