బ్యూటీ వలలో పడ్డ భాయ్‌!

బ్యూటీ వలలో పడ్డ భాయ్‌!

నడి నలభైల్లో ఉన్నా కానీ ఇంకా పెళ్లి చేసుకోని సల్మాన్‌ ఖాన్‌ తన లవర్‌బాయ్‌ వేషాలు మాత్రం మానడం లేదు. తెరపై మాస్‌ హీరోగా చెలరేగిపోయే సల్మాన్‌ నిజ జీవితంలో మాత్రం యువ హీరోయిన్లపై మనసు పారేసుకుని పీకల్లోతు ప్రేమలో పడి... లేస్తుంటాడు. అతను ఇంతవరకు ప్రేమించిన, 'బ్రేకిచ్చిన' హీరోయిన్ల జాబితా పెద్దదే ఉంది. ఐశ్వర్యారాయ్‌తో మొదలు పెట్టి, కత్రినా కైఫ్‌తో కొనసాగించి.. జరీన్‌ ఖాన్‌, స్నేహా ఉల్లల్‌ తదితరులందరినీ ప్రోత్సహించిన సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం డెయిసీ షా అనే కొత్త హీరోయిన్‌ మోజులో పడ్డాడని బాలీవుడ్‌ టాక్‌. చాలా మంది హీరోయిన్లని కాదని తన తాజా చిత్రంలో డెయిసీని హీరోయిన్‌గా ఎంచుకున్న సల్మాన్‌ ఖాన్‌ ఈమె మీద స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడట. భాయ్‌ ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించడం డ్రీమ్‌లాంటిది కాబట్టి ఆమె కూడా సానుకూలంగానే స్పందిస్తోందని, అయితే ఇది కూడా కొద్దిరోజుల యవ్వారమో లేక కొంతకాలమైనా కొనసాగుతుందో చూడాలని అంటున్నారు. సల్మాన్‌ మాత్రం పెళ్లికి రెడీగా లేనంటూనే ఇలా ఎప్పటికప్పుడు కొత్త పిల్లలతో సరసాలు సాగించేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు