ప్రిన్స్‌ ఇంకో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నాడు

ప్రిన్స్‌ ఇంకో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నాడు

మహేష్‌ బాబు ఫాలోయింగ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే మిగతా హీరోలతో పోలిస్తే ఈ సూపర్‌స్టార్‌కున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఓవర్సీస్‌లో అతడి సినిమాలకు ఊహించని రీతిలో రెస్పాన్స్‌ ఉంటుంది. దూకుడు, బిజినెస్‌మేన్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు.. ఎప్పటికప్పడు యుఎస్‌లో తెలుగు సినిమాలకు సంబంధించి రికార్డులు బద్దలు కొడుతూ పోయాయి. చివరికి ఫ్లాప్‌గా నిలిచిన '1' సినిమా కూడా యుఎస్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ కలెక్షన్లతో అక్కడి ట్రేడ్‌ పండితుల్ని ఆశ్చర్యపరిచింది.

మొత్తానికి యుఎస్‌లో మనోడి ఫాలోయింగేంటో 14 రీల్స్‌ వాళ్లకు బాగా తెలుసు కాబట్టి.. ప్రిన్స్‌ కొత్త సినిమా 'ఆగడు'ను తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీగా, ఓ బాలీవుడ్‌ మూవీ రేంజిలో అక్కడ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ఇంకో సెన్సేషన్‌ ఉంది. అమెరికాలోని యూనివర్శిటీల్లో స్పెషల్‌ షో కూడా వేయబోతున్నారట.

యుఎస్‌లోని ప్రతి యూనివర్శిటీకి వెళ్లి ఒపీనియన్‌ పోల్‌ పెట్టి.. 100 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు 'ఆగడు' చూడాలని కోరితే.. స్పెషల్‌ షో వేస్తారట. ఇలా చేయడం ద్వారా ఓ కొత్త సంప్రదాయానికి ప్రిన్స్‌ తెరతీయబోతున్నట్లే. దీని ద్వారా ప్రిన్స్‌ ఫాలోయింగేంటో యుఎస్‌ జనాలకు మరింతగా అర్థమై.. మనోడు టాక్‌ ఆఫ్‌ ద కంట్రీ అయిపోతాడని ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English