మహేష్‌ అయినా బ్రేకిస్తాడా?

మహేష్‌ అయినా బ్రేకిస్తాడా?

    కార్పొరేట్‌ సంస్థలకి ఎందుకో తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా కలిసి రాలేదు. అత్తారింటికి దారేది, మనంలాంటి విజయాలతో ఇప్పుడిప్పుడే రిలయన్స్‌ సంస్థ ఇక్కడ నిలదొక్కుకుంటోంది. అయితే ఇతర భాషలతో పోలిస్తే టాలీవుడ్‌లో కార్పొరేట్‌ సంస్థలు సక్సెస్‌ అవలేదు. మహేష్‌బాబు '1 నేనొక్కడినే'తో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని హోల్‌సేల్‌గా మార్కెట్‌ చేసిన ఆ సంస్థకి దాంతో భారీ నష్టాలే వచ్చాయి.

ఆ సంస్థకి ఈ ఏడాదిలో చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. సల్మాన్‌ఖాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా... వీరు నిర్మించిన జైహో మాత్రమే ఫ్లాపయింది. ఇక రజనీకాంత్‌ నటించిన యానిమేషన్‌ సినిమా విక్రమసింహా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న ఈ సంస్థ ఇప్పుడు 'ఆగడు'ని కూడా మార్కెట్‌ చేస్తోంది. ఈ చిత్రంతో అయినా తమ పరాజయాల పరంపరకి బ్రేక్స్‌ పడతాయని ఈరోస్‌ ఆశిస్తోంది. మరి మహేష్‌బాబు ఆగడుతో దానిని ఆపేస్తాడో లేదో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English