బాద్‌షా జస్ట్‌ ట్రెయిలరే!

బాద్‌షా జస్ట్‌ ట్రెయిలరే!

'బాద్‌షా'తో ఆల్‌ టైమ్‌ హిట్‌ కొడతాడని ఫాన్స్‌ ఆశించారు కానీ అది జరగలేదు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌ అయింది కానీ ఆల్‌టైమ్‌ టాప్‌ త్రీ సినిమాల్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సినిమా వల్ల ఎన్టీఆర్‌కి ఓవర్సీస్‌, నైజాంలో పట్టు దొరికింది. ఇంతకుముందు ఎన్టీఆర్‌కి ఈ ఏరియాల్లో అంతగా ఫాలోయింగ్‌ లేదు. కానీ బాద్‌షాతో ఎన్టీఆర్‌ వారికి దగ్గరయ్యాడు. బాద్‌షాతో నలభై అయిదు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్‌కి ఇది ట్రెయిలర్‌ మాత్రమేనని అంటున్నారు.

అతని తదుపరి చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'తో ఆల్‌ రికార్డ్స్‌ రీసెట్‌ చేస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిజం పీక్స్‌లో ఉంటుందట. బాద్‌షా సినిమాని శ్రీను వైట్ల కామెడీతో నడిపేశాడు. దీని వల్ల ఎన్టీఆర్‌ మాస్‌ ఫాన్స్‌ సంతృప్తి చెందలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హీరోయిజం కూడా తోడైతే ఎన్టీఆర్‌లాంటి హీరోతో వండర్స్‌ సృష్టించవచ్చు. ఆ కిటుకు వాడాడు కాబట్టే హరీష్‌ శంకర్‌ 'గబ్బర్‌సింగ్‌'తో అంతటి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు 'రామయ్యా వస్తావయ్యా'లో కూడా సేమ్‌ ఫార్ములా వాడుతున్నాడట. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ రియల్‌ పవర్‌ ఏమిటో తెలుస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు