నెగెటివ్‌ పబ్లిసిటీపై చరణ్‌ మోజు

నెగెటివ్‌ పబ్లిసిటీపై చరణ్‌ మోజు

తెలుగులో తిరుగులేని హీరోగా నెం.1 స్థానంలో ఏకంగా రెండు దశాబ్దాలు పాటు తన జెండా ఎగరవేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వారసుడిగా వచ్చిన యంగ్‌ హీరో రామ్‌చరణ్‌ కూడా అనతికాలంలోనే నెంబర్‌ వన్‌ కిరీటంకోసం గట్టి పోటీని ఇస్తున్నాడు. వరుసగా ఫార్ములా సినిమాలు చేస్తూ, అభిమానులను కూడా బాగా అలరించడం, రికార్డులు నెలకొల్పడం వంటిని తన హాబీగా మార్చుకున్నాడు. అయినాసరే మనోడు ఎక్కువ నెగెటివ్‌ పబ్లిసిటీకే ఓటేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఆ మధ్య  మీడియాను వెంట్రుక అనేసిన చరణ్‌, ఇప్పుడు కొత్తగా రోడ్డుమీద ఎవరితోనూ గొడవపడ్డం వగైరా అంశాలన్నీ మనోడికి నెగెటివ్‌ ప్రచారాన్నే  కల్పిస్తున్నాయి. బాలీవుడ్‌లోని స్టార్‌ హీరోలైన షారూఖ్‌, అక్షయ్‌, సల్మాన్‌లు కూడా ఇలాంటి నెగెటివ్‌ ప్రచారంతోనే బాగా ప్రాచుర్యం పొందారు. చూస్తుంటే చరణ్‌కూడా అదే దారిలో వెళ్తున్నట్లు అనిపించడంలేదు. కాని తెలుగు మీడియాలో ఇలా నెగెటివ్‌ మార్కులు వేయించుకోవడం అంత శ్రేయస్కరం కాదని అభిమానుల ఫీలింగ్‌. మరి చరణ్‌ ఏమంటాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు