'ఆటోనగర్ సూర్య' అడ్రస్ మిస్సయ్యాడా?

'ఆటోనగర్ సూర్య' అడ్రస్ మిస్సయ్యాడా?

రామ్ చరణ్ తేజ "జంజీర్'' నాగచైతన్యల 'ఆటోనగర్' సూర్యల పరిస్థితి దాదాపుగా ఒకేలాగా ఉంది. జంజీర్ విషయంలో ఇంకా ఎక్కువ సమయం కాలేదు కానీ, ఆటోనగర్ సూర్యమాత్రం బ్రేకులు పడిపోయి మొరాయిస్తున్నాడు! అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు వివరాలు 'బెజవాడ' సినిమా కన్నా ముందే వచ్చాయి! ఆ బెజవాడ సినిమా వచ్చి వెళ్లి కూడా రెండేళ్లు గడిచిపోయాయి! అయితే ఆటోనగర్ సూర్యమాత్రం అడ్రస్సు మిస్సయినట్టుగా ప్రేక్షకులను చేరుకోలేకపోతున్నాడు. ఈ సినిమాను రూపొందిస్తున్న ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారి వల్లనే ఈ సినిమా వాయిదా పడిందని ఒక పుకారు.

నాగార్జునతో వీరు తీసిన 'ఢమరుకం' కూడా విడుదల విషయంలో మొరాయించిన సంగతి తెలిసిందే! ఎట్టకేలకూ ఆ సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు నాగార్జున కొడుకు విషయంలో కూడా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు ఇదే విధంగా స్పందిస్తున్నారు. ఈ సినిమాను విడుదల చేయడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు! ఈ విధంగా ఈ నిర్మాతలు నాగార్జునను మరోసారి ఇబ్బంది పెడుతున్నారు. 'ప్రస్థానం' వంటి సినిమాను తీసిన దేవాకట్టా ఈ సినిమాను రూపొందిస్తుండటంతో దీని మీద అంచనాలు మరింత పెరిగాయి! ఈ అంచనాలను చల్లారిపోయేలోపే విడుదల అయితే ఈ సినిమా పరువు అంతో ఇంతో నిలబడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు