కోబలి... ప్రయోగాలు ఫలిస్తాయా?

కోబలి... ప్రయోగాలు ఫలిస్తాయా?

ప్రస్తుతం మన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తరువాత, మళ్ళీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోనే ఇంకో సినిమా చెయ్యడానికి ప్లాన్‌ చేశాడు పవన్‌. 'కోబలి' అనే వింత టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా, రాయలసీమలోని కొన్ని దురాచారాలపై తీస్తున్న సందేశాత్మక ఆర్ట్‌ సినిమా అన అర్ధమవుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ క్రేజంతా అతని స్టయిల్స్‌, డ్యాషింగ్‌ యాక్షన్‌, వెరైటి డైలాగ్‌ డెలివరిలోనే ఉంది. కాని అవన్నీ  ప్రక్కన పెట్టేసి ఇలా ఆచారాలు, వ్యవహారాలు అంటూ ఆర్ట్‌ సినిమాలు తీస్తే సక్సెస్‌ వస్తుందా అనేది విశ్లేషకుల అనుమానం. వరుసపెట్టి కమర్షియల్‌ సినిమాలు చేస్తున్న పవన్‌, అసలు మళ్లీ ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాడు అంటూ అభిమానులు కూడా కాస్త భయపడుతున్నారు. అయితే ఈ కథలో కూడా త్రివిక్రమ్‌ మార్కు యాక్షన్‌ సీన్లు ఉంటాయని సన్నిహితులు చెబుతున్నారు కాని, దీనిని ఎంత తక్కువ బడ్జెట్లో తీస్తే అంత బెటర్‌. తేడావస్తే, మళ్ళీ అభిమానులకు జాని, పులి రోజులు గుర్తొచ్చే ఛాన్స్‌ ఉంది.

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు