అవన్నీ చరణ్‌ ఖాతాలో వేస్తారా?

అవన్నీ చరణ్‌ ఖాతాలో వేస్తారా?

చరణ్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రం ‘జంజీర్‌’. ఈ మూవీతో బాలీవుడ్‌కి మన స్టైల్‌ యాక్షన్‌ని పరిచయం చేస్తానన్న చెర్రీకి ఊహించని రీతిలో దెబ్బమీద దెబ్బపడుతోంది.

ఆరంభమే ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ‘జంజీర్‌’ మాతృక రచయితలు రీమేక్‌ నిర్మాతలపై కోర్టొక్కారు. సినిమా పూర్తయినా ..రిలీజవ్వాలంటే రీమేక్‌ హక్కుల కింద భారీ మొత్తం చెల్లించాలంటూ పట్టుబట్టారు. అదంతా ఓ ఎపిసోడ్‌. ఈ ఎపిసోడ్‌ కొనసాగుతుండగానే ఈ సినిమాలో విలన్‌గా నటించిన సంజయ్‌దత్‌ అక్రమాయుధాల కేసులో తీర్పు వెలువడి జైలుకెళ్లాడు. అదలా ఉండగానే సెట్స్‌లో కాలికి గాయమై సోనూసూద్‌ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అంతేకాదు..ఈ సినిమాలో చెర్రీ సరసన నటించిన ప్రియాంక చోప్రా తండ్రి కాలం చేశాడు.

అయితే ‘జంజీర్‌’ విషయంలో ఏం జరిగినా..అదంతా చెర్రీ వల్లేనని ముంబైలో అనుకుంటున్నారట. ఇదెక్కడి న్యాయం? ముంబైలో తుఫాన్‌ వచ్చి అక్కడ ఎన్నో ఇల్లు కూలిపోయాయి. దానికీ చెర్రీనే కారణమా? ఇలా అన్యాయంగా ప్రతిదీ చరణ్‌ ఖాతాలో వేయడం భావ్యమా అంటూ మెగా అభిమానులు వాపోయారు..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు