జియా మరణం వెనుక నమ్మలేని నిజాలు!

జియా మరణం వెనుక నమ్మలేని నిజాలు!

జియా ఖాన్ మరణం అందరి మనసులనూ కలచి వేసింది. రోజురోజుకూ ఆమె గురించి బయట పడుతున్న నిజాలు వింటే అందరి కళ్లూ తడిచిపోతున్నాయి. మొదట అవకాశాల్లేక దిగులుతో చనిపోయిందని అన్నారు. కానీ కాదని తెలిసింది. ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్ ని ప్రేమించి, అతడు కాదన్నాడని ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. అది కూడా అసలు కారణం కాదని ఇప్పడు తేలింది.

జియా గదిలో దొరికిన ఏడు పేజీల లేఖ, ఆమె విషాద గాథను ప్రపంచం ముందు పరిచింది. జియా సూరజ్ ను ప్రేమించిన మాట నిజమే. అది కూడా మామూలుగా కాదు. ప్రాణంగా ప్రేమించింది. కానీ సూరజ్ మోసగాడు. అతడికి చాలామందితో సంబంధాలు ఉన్నాయి. అయినా జియాతో ప్రేమను నటించాడు. నటించి వంచించాడు. రెండు రోజుల పాటు తన దగ్గర బంధించి, పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆమె గర్భం దాలిస్తే, అబార్షన్ చేయించుకోమంటూ చిత్రహింసలు పెట్టాడు. ఆమె ఇష్టపడకపోయినా బలవంతంగా అబార్షన్ చేయించాడు. అంత చేసినా ఆమె అతణ్ని ప్రేమిస్తూనే ఉంది. అతడితో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంది. కానీ అతడు ఆమెను కాదన్నాడు. చనిపోవడానికి ముందు రెండు రోజుల పాటు జియా అతడి దగ్గరే ఉంది. ఆ సమయంలో అతడు ఆమె శారీరకంగా చిత్రహింసలు పెట్టాడని జియా లేఖ ద్వారా తెలుస్తోంది. అందుకే ఆ లేఖ చదవడంతోనే పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

సూరజ్ తల్లి జరీనా వాహబ్ తన కొడుకు నిర్దోషి అంటూ వాదిస్తోంది. అది ప్రేమలేఖ తప్ప సూసైడ్ నోట్ కాదంటోంది. నువ్వు నాకు అన్యాయం చేశావు, నీవల్ల నా జీవితం నాశనమయ్యింది అని రాసిన లేఖ ప్రేమలేఖ ఎలా అవుతుంది అంటూ పోలీసులు ఆమెను నిలదీశారు. ఏది ఏమైతేనేం జియా జీవితం మొగ్గలోనే రాలిపోయింది. ఆమె కథ ఓ విషాదగాథగా మిగిలిపోయింది. త్వరలోనే ఈమె జీవితంపై సినిమా తీయాలని ఓ దర్శకుడు అప్పుడే సిద్ధపడుతున్నట్టు సమాచారం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు