వెంకీ కెరీర్‌లో షాడో నంబర్‌వన్‌

వెంకీ కెరీర్‌లో షాడో నంబర్‌వన్‌

స్టయిలిష్‌ దర్శకుడు మహేర్‌ రమేష్‌ రూపొందించిన 'షాడో' చిత్రం వెంకీ కెరియర్‌లోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతవరకు తన పేరిటి వున్న ఫ్లాపు రికార్డు చెక్కుచెదరకుండా కాపాడుకున్నాడు మెహర్‌ రమేష్‌. అందుకే ఈ సినిమా వెంకీ కెరియర్‌లోనే ది బెస్ట్‌ ఫ్లాప్‌గా చరత్రలో నిలిచిపోనుంది.

ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి డిజాస్టర్‌లో నటించలేదు వెంకి. ఏదో కొత్త గెటప్‌తో,స్టయిలిష్‌ గన్స్‌తో, హెలికాప్టర్‌ చేజ్‌లతో కెరీర్‌లో అతి పెద్ద యాక్షన్‌ హిట్‌ కొట్టాలని వెంకీ ఆశిస్తే, మెహర్‌ రమేష్‌ మాత్రం పేలవమైన కథతో వెంకీ ఆశలపై యాకంగా హుస్సేన్‌ సాగర్‌ నీళ్ళు చల్లాడు.

సినిమా వెనుకల కోన వెంకట్ ‌, గోపి మోహన్‌ లాంటి స్టార్‌ రచయితల పేర్లు ఉన్నాకూడా, సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అవి కాపాడలేకపోయాయి. కనీసం మినిమం గ్యారంటీ సినిమాగానైనా మిగిలిపోతుందని ప్రొడ్యూసర్లు తలిస్తే, షాడో మాత్రం యాకంగా గ్యారంటీలెస్‌ సినిమాగానే తన సత్తా చూపించింది. పోనివ్‌లేండి, ఇది ఒక రికార్డే అనుకొని సంబరాలు చేసుకోవాలంతే!

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు