దటీజ్‌ మహేష్‌ బాబు!!!

దటీజ్‌ మహేష్‌ బాబు!!!

దటీజ్‌ మహాలక్ష్మి.. ఇది పాత స్టోరి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతటా మారుమ్రాగుతున్న డైలాగ్‌ 'దటీజ్‌ మహేష్‌ బాబు'. అవును, టైమ్స్‌ పత్రిక చేసిన ఒక సర్వేలో మన మహేష్‌ రెండో స్థానంలో నిలవడంతో, ఇండియా అంతటా ఇప్పుడు మనోడి పేరు మారుమ్రోగుతోంది. టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ పేరుతో చేపట్టిని సర్వేలో టాప్‌-50 హీరోలను తీసుకుంటే అందులో మహేష్‌ బాబు జస్ట్‌ కొన్ని ఓట్లతో వెనకబడి రెండో స్థానంలో నిలిచాడు.

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రామ్‌పాల్‌కు మొదటి స్థానం దక్కింది. అసలు ఇంతవరకు తెలుగులో తప్పించి వేరే బాషలో కనీసం సినిమాకాదు కదా, చిన్న షార్ట్‌ ఫిలిం కూడా చెయ్యని మహేష్‌కు రెండో స్థానం రావడంతో యావత్‌ సినిమా ఇండస్ట్రీలన్నీ షాక్‌ తిన్నాయి. సల్మాన్‌ వంటి కండలవీరులను, జాన్‌ అబ్రహమ్‌ వంటి హ్యాండ్‌సమ్‌ మగాళ్లను, రణబీర్‌ కపూర్‌ వంటి యువరాజులను సైతం ప్రక్కను నెట్టేసి, మనోడు రెండో స్థానం కైవసం చేసుకున్నాడంటే మహేష్‌ ఇమేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. ఇక తెలుగునుండి ఈ జాబితాలో నిలిచిన మిగిలిన హీరోలు రానా (10), రామ్‌చరణ్‌ (18) మాత్రమే. కంగ్రాట్స్‌ మహేష్‌!

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు