దాసరికి ఆమె ఐస్‌క్రీమ్‌లా ఉందట

దాసరికి ఆమె ఐస్‌క్రీమ్‌లా ఉందట

సాధారణంగా హీరోయిన్లను ఎప్పుడూ తిడుతూ ఉండే మన దర్శకరత్న, ఒక్కసారిగా తన కవిత్వం రంగరించిన మాటలతో వారిని పొగిడితే సీన్‌ ఎలా ఉంటుందో ఊహించారా. వరుణ్‌ సందేశ్‌ నటించిన సరదాగా అమ్మాయితో సినిమా ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి విచ్చేసిన దాసరి, అక్కడకు వచ్చిన అందాల అతిథి ఛార్మిని ఒక రేంజ్‌లో పొగిడేశారు.

మొదట్లో ఈమెకు తెలుగురాదు అని దాసరి తిట్టినవెంటనే, మూడు నెలల్లో ఛార్మి తెలుగు నేర్చుకుందట. ఇక ఈ ఐస్‌క్రీమ్‌ కామెంట్‌ కూడా వినండి. ఆ మధ్య ఏదో ఐస్‌క్రీంలాగా లావుగు పెరుగుపోతుందేంటి అనుకున్న ఛార్మి, సడన్‌గా ఇలా సన్నగా నాజూకుగా తయారవ్వడం చాలా బాగుంది అంటూ పొగిడేశారు దాసరి. హీరియిన్స్‌ను ఎక్కువగా తిట్టే దాసరి, అలా సెక్సీగా ఐస్‌క్రీంతో పోల్చిమరీ పొగుతుంటే, వినేవాళ్లకు కాస్త ఆశ్చర్యమేసింది. ఏది ఏమైనా ఛార్మి అందాలకున్న పవర్‌ అలాంటిది. ఎవరైనా ఫ్లాట్‌ కావల్సిందే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు