దృశ్యంకి గుడ్‌ న్యూస్‌

దృశ్యంకి గుడ్‌ న్యూస్‌

 వీకెండ్‌లో అదరగొట్టిన దృశ్యం వీక్‌ డేస్‌లో కూడా స్టడీగా బిజినెస్‌ చేయడంతో ఈ చిత్రం నిలకడగా మంచి రేంజ్‌కి చేరుకుంటుందని ట్రేడ్‌ రిపోర్టులు వస్తున్నాయి. మొదటి వారంలో పది కోట్ల షేర్‌ దక్కడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇక రెండవ వారంలో కూడా దృశ్యంకి ఎదురు ఉండదు. ఈవారంలో రెండు చిన్న సినిమాలే రిలీజ్‌ అవుతున్నాయి. చెప్పుకోతగ్గ సినిమాలేవీ లేకపోవడం దృశ్యంకి హెల్ప్‌ అవుతుంది. కాస్త స్లోగా టేకాఫ్‌ తీసుకున్న దృశ్యంకి స్ట్రాంగ్‌ సెకండ్‌ వీక్‌ చాలా అవసరం.

అదృష్టం కొద్దీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసే సినిమాలేవీ రిలీజ్‌ కాకపోవడంతో ఈవారం కూడా దృశ్యం ప్రేక్షకులకి ఫస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది. దీనిని అనుకూలంగా మార్చుకుని ఈవారంలో అయిదారు కోట్ల షేర్‌ రాబట్టినట్టయితే ఫుల్‌ రన్‌లో ఇరవై కోట్ల షేర్‌ని రీచ్‌ అవడానికి అవకాశాలుంటాయి. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకి కాసుల పంట పండిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు