ఎంత పని చేసావయ్యా సూర్యా..!

ఎంత పని చేసావయ్యా సూర్యా..!

    ఆటోనగర్‌ సూర్య విడుదల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన దర్శకుడు దేవాకట్టాకి తీవ్ర నిరాశ ఎదురైంది. రెండవ వారానికి వచ్చేసరికి ఈ చిత్రం పెద్ద ఫ్లాప్‌ అని తేలిపోయింది. దీంతో ఈ చిత్రం లేటుగా అయినా పుంజుకుంటుందని కలలు కన్న దేవా కట్టాకి అడియాసే మిగిలింది. ఇది రిలీజ్‌కి ఇబ్బంది పడుతోన్న టైమ్‌లో దేవా కట్టాకి పలు చిత్రాలకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. గోపీచంద్‌ హీరోగా ఒక సినిమాకి డిస్కషన్స్‌ కూడా జరిగాయి. అయితే ఆటోనగర్‌ సూర్య రిలీజ్‌ అయితే దర్శకుడిగా తన స్థాయి పెరుగుతుందని, అందుకు తగ్గ పారితోషికం, హోదా లభిస్తాయని దేవా కట్టా ఆశ పడ్డాడు.

అసలు ఈ సినిమా విజయం సాధిస్తే అఖిల్‌ని హీరోగా పరిచయం చేసే అవకాశాన్ని నాగార్జునే పిలిచి ఇస్తాడని కట్టా ఆశ పడ్డాడు. తీరా ఆటోనగర్‌ సూర్య పేలవంగా ఉందని తేలిపోవడంతో అంతకుముందు ప్రస్థానం టైమ్‌లో దేవా కట్టాపై ఉన్న ఆసక్తి ఇప్పుడు హీరోలకి లేకుండా పోయింది. అఖిల్‌ కాదు కదా.. ఏ చిన్న హీరో కూడా ఇప్పుడు కట్టా డైరెక్షన్‌లో నటించాలని సరదా పడడం లేదు. నాలుగేళ్ల సమయం వృధా కావడమే కాకుండా పాపం దేవా కట్టాకి ఇప్పుడు భవిష్యత్తు ఏమిటో కూడా తెలియకుండా చేసింది ఆటోనగర్‌ సూర్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు