ఆటో...` హిట్టు అనేసెయ్యండి!

ఆటో...` హిట్టు అనేసెయ్యండి!

తీసిన సినిమా గురించి జ‌నాలు ఏమ‌నుకొంటున్నార‌నే విష‌యం మ‌న ద‌ర్శకులకు ప‌ట్టదేమో.  అందులో మైన‌స్‌ల‌ని ప‌క్కకు తోసేసి మిగ‌తా విష‌యాల్ని బ‌య‌ట చూపించే ప్రయ‌త్నం చేస్తుంటారు.  త‌మ స్టైల్లో తాము లెక్కలేసుకొంటూ ` సినిమా  హిట్టంతే.. ` అని గుడ్డిగా వాదిస్తుంటారు. సినిమా బాగోలేద‌న్న నిజాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోరు. దేవాక‌ట్టా కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆయ‌న తీసిన `ఆటోన‌గ‌ర్ సూర్య‌` ఇటీవ‌లే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో హీరో బాగున్నాడు. డైలాగులు బాగున్నాయి. తీత కూడా బాగానే ఉంది. అయితే ఈ `బాగు`లేవీ సినిమాని కాపాడ‌లేక‌పోయాయి. క‌థ‌ని న‌డిపించిన విధాన‌మే సినిమాకి అత‌క‌లేద‌ని ప్రేక్షకులు పెద‌వి విరిచారు.

దేవాక‌ట్టా మాత్రం సినిమాకి అయిన ఖ‌ర్చునీ, వ‌సూళ్లను చూపిస్తూ `సినిమా హిట్టంతే` అని  ప్రచారం చేసుకొంటున్నాడు. 10 కోట్లకు మించి సినిమాకి ఖ‌ర్చు కాలేద‌నీ, ఆ ర‌కంగా చూస్తే తొలి ఆరు రోజులు వ‌సూళ్లతోనే ఈసినిమా హిట్టని దేవా ట్వీట్ చేశాడు. ఆయ‌న లెక్క క‌రెక్టే కావొచ్చు. కానీ సినిమా ప్రేక్షకుల‌కు రుచించ‌లేదు. అలాగే మూడేళ్లు తీసిన ఈ సినిమాకి ఖ‌ర్చు మూడింత‌లు అధిక‌మైంది. ఇంకా నెల రోజులు థియేట‌ర్లలో నిలదొక్కుకున్నా నిర్మాత‌ల‌కు న‌ష్టాలు త‌ప్పవు. వీట‌న్నిటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా తాను క‌మ‌ర్షియ‌ల్ హిట్టు సాధించేశానంతే అని డ‌ప్పు కొట్టుకోవ‌డం దేవా క‌ట్టాలాంటి ద‌ర్శకుల‌కు త‌గ‌ద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు