ఇక పెద్ద సినిమాలు పడితే చాలు!

ఇక పెద్ద సినిమాలు పడితే చాలు!

‘బాతు గుడ్డు అంత కళ్లు నావి. అవి చూసే మా వీధిలో కుర్రాళ్లంతా పడిపోయేవారు. నా గురించి మీకేం తెలుసు’ అంటూ గడుసు పిల్లలా సుధీర్‌బాబు అండ్‌ టీవ్‌ుని టీజ్‌్‌ చేసేసిన నందిత రెండో సినిమాతోనే నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకుంది. తేజ ‘నీకు నాకు డాష్‌ డాష్‌’తో పరిచయమైనా..ఆ సినిమా హిట్కెక్కకపోవడంతో అనుకున్నంత గుర్తింపు రాలేదీ విశాఖ సుందరికి. అయితే తాజాగా సుధీర్‌-మారుతి-ప్రభాకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమ కథాచిత్రవ్‌ు’లో అద్భుతమైన అభినయాన్ని కనబరిచిన ఈ  తెలుగమ్మాయి సినిమాకే పెద్ద అస్సెట్‌ అయింది. అంతేకాదు...సినిమా ఆద్యంతాన్ని తన భుజస్కంధాలపైనే నడిపించి ఏకఛత్రాధిపత్యం వహించింది.

జుత్తు విరబోసుకుని, ఇంతలేసి కనుగుడ్లను గిరగిరా తిప్పుతూ..చంద్రముఖిని తలపించిన నందిత..కుర్రకారు ఎవరూ భవిష్యత్‌లో ఏ ఆడదాన్ని తాకగూడదు..అనిపించేంతగా భయపెట్టేసింది. ఆత్మ ఆవహించిన అమ్మాయిగా ఇరగదీసేసింది. కాటుక పూసిన కళ్లతో తాటకిలా కనిపించి..అభినయాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈ అమ్మడి నటనను అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. అయితే ఇప్పటివరకూ చేసినవి చిన్న సినిమాలే. ఈ సారి ఓ పెద్ద సినిమా పడితే చాలు. కెరీర్‌ వెనుదిరిగి చూడాల్సిన పనిలేకుండా పోతుంది. అయితే ప్రస్తుతం నందిత పృధ్వీరాజ్‌ సరసన ‘లండన్‌ బ్రిడ్జ్‌’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు