శ్రీదేవి.. ఎక్స్‌ట్రాలు చేశాక కూడా..

శ్రీదేవి.. ఎక్స్‌ట్రాలు చేశాక కూడా..

అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగన్నా, తెలుగువారన్నా చులకన!! గతంలో టాలీవుడ్‌ని తెగ తిట్టింది. తెలుగులో యాక్టింగ్‌ కన్నా గ్లామర్‌ ముఖ్యం. అదే తమిళ్‌లో అయితే నటనకే ప్రాధాన్యం..అంటూ మనల్ని అవమానించి మాట్లాడింది. అంతేకాదు తనని పద్మశ్రీ వరించిన శుభవేళ కనీసం తెలుగువారిని గుర్తు చేసుకోకుండా..తమిళ తంబీలతో చెన్నైలోనే గ్రాండ్‌గా పార్టీ కూడా చేసుకుంది. అయినా ఈ అమ్మడిని మనవాళ్లు నెత్తిన పెట్టుకుని పూజించాలని చూస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఓ కొత్త టీవీచానెల్‌ ప్రారంభం కానుంది. దీనిలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగువెర్షన్‌ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎపిసోడ్‌కు 20క్షలు చెల్లించి శ్రీదేవిని హోస్ట్‌గా పెట్టుకోవాలని సదరు చానెల్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయట. ఏం? మనదగ్గర ట్యాలెంట్‌ లేదా? జయప్రధ, జయసుధ..వీళ్లేం స్టార్లు కాదా? అడిగితే వాళ్లు చేయనంటారా? అంతెందుకు ఏ రామ్ చరణ్‌నో, మహేష్‌బాబునో అడిగితే కాదంటారా? లక్షల్లో వస్తుందంటే వదులుకుంటారా? ఆవిడంటేనే అంత మోజెందుకో? తెలుగువారిని చిన్న చూపు చూసినా..అవమానించేలా మాట్లాడినా..అమ్మడి వెంటే పడడానికి కారణం ఏమిటో? సదరు పెద్దలే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు