వామ్మో వామ్మో... ప‌వ‌న్‌తో చేయాల‌నుకొన్నాడా?!

వామ్మో వామ్మో... ప‌వ‌న్‌తో చేయాల‌నుకొన్నాడా?!

ఒక‌రి కోసం రాసుకొన్న క‌థ‌ల్లో మ‌రొక‌రు న‌టించ‌డం చిత్రసీమ‌లో త‌ర‌చూ జ‌రిగేదే. అయితే ఎవ‌రికోసం రాసుకొన్న క‌థ‌లో ఎవ‌రు న‌టించార‌న్న విష‌య‌మే కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తీయాల‌నుకొన్న `అత‌డు` సినిమాని త్రివిక్రమ్ చివ‌రికి మ‌హేష్‌బాబుతో తీశాడు. ఆ క‌థ చెప్పడానిక‌ని  వెళితే ప‌వ‌న్ క‌ల్యాణ్ నిద్రపోయాడ‌ట‌. దీంతో త్రివిక్రమ్ వెనుదిరిగి వ‌చ్చాడు.  పోకిరి కూడా అంతే. ప‌వ‌న్‌తో తీయాల‌నుకొంటే ఆయ‌న ఒప్పుకోలేదు. దీంతో పూరి జ‌గ‌న్నాథ్ ఆ చిత్రాన్ని మ‌హేష్‌బాబు తీసేసి హిట్టు కొట్టాడు.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆటోన‌గ‌ర్ సూర్య‌`ని తొలుత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేయాల‌నుకొన్నాడ‌ట దేవాక‌ట్టా. ప‌వ‌న్‌కి క‌థ కూడా వినిపించాడ‌ట‌. ఆ విష‌యాన్ని స్వయంగా దేవాక‌ట్టానే చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ మాత్రం క‌థ‌పై అంత‌గా ఆస‌క్తి చూప‌లేద‌ట‌. నాకు న‌ప్పే క‌థ కాద‌ని చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత కూడా చాలామంది క‌థానాయ‌కులకు ఈ క‌థ‌ని వినిపించాడ‌ట‌. అంద‌రూ నో చెప్పారట‌. చివ‌రికి నాగ‌చైత‌న్య ఓకే చెప్పాడు. వాళ్లంతా ఈ సినిమా ఒప్పుకోలేక‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. క‌థానాయ‌కుడు ప‌దిహేనేళ్ల వ‌య‌సున్న కుర్రాడిలా మారిపోవాల్సి ఉంటుంద‌ని దేవాక‌ట్టా చెప్పిన మాటతో అంద‌రూ వెన‌క్కి త‌గ్గారు. ఆ ర‌కంగా చివ‌రికి క‌థ నాగ‌చైత‌న్య కోర్టులోకి వ‌చ్చి ప‌డింద‌న్నమాట‌. మ‌రి ఈ క‌థ‌లో  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌నో, మ‌హేష్‌బాబునో ఓసారి ఊహించుకొని చూడండి, ఎలా ఉండేదో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు