రెబల్‌స్టార్‌కు సారీ చెప్పేసింది!!!

రెబల్‌స్టార్‌కు సారీ చెప్పేసింది!!!

ఏ స్టేజీ ప్రోగ్రావ్‌ుకైనా మన సెక్సీ యాంకర్లను పిలుస్తుంటారు నిర్మాతలు. అయితే ఇది ప్రోగ్రాంకు లుక్‌ తీసుకురావడానికే కాని, యాంకర్ల యాంకరింగ్‌తో గానా భజానా చెయ్యడానికి కాదు. అనవసరంగా అరుస్తూ...గోల గోలగా అతిధుల్ని స్టేజీమీదికి పిలవడం...ఆపై వారి గురించి కాస్త సుత్తివేసి, ఉన్నవీ లేనివీ కలిపి పొగిడేయడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్‌. ఈ మధ్య జరిగిన ‘చండీ’ సినిమా టీజర్‌ లాంచ్‌లోనూ అదే జరిగింది.

వేదికపై యాంకరింగ్‌ చేస్తున్న ఆంటీ శిల్పా చక్రవర్తి...శ్రుతిమించి అరిచింది. రెచ్చిపోయి..అతిధులను ఆహ్వానిస్తూ, సాక్షాత్తూ రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుని ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అంటూ పిలిచేసింది. దాంతో చిర్రెత్తుకుపోయిన రెబల్‌స్టార్‌ నేరుగా యాంకరమ్మపై పదే పదే దెప్పిపొడుపులు పొడిచారు. ‘ఏం మాట్లాడితే ఓల్డ్‌ అంటుందో యాంకరమ్మ’ అంటూ చురకలేశాడు. అంతేకాదు..ఆగి ఆగి ..ప్రసంగం అయిపోయేవరకూ అదే గుర్తుచేసి, శిల్పాని చీల్చి చెండాడాడు. దాంతో చివరికి ‘సారీ సార్‌ తప్పయింది. అలా పిలిచినందుకు క్షమించండి’’ అంటూ చెప్పుకొచ్చింది శిల్పా చక్రవర్తి. ఆమె చేసిన ‘ఓల్డ్‌’ కామెంట్‌లో నిజమున్నా, చెప్పిన టైమింగ్‌ ఈ తిప్పలు తెచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు