మ‌హేష్‌ని బుట్టలో వేసుకొన్నాడు!

మ‌హేష్‌ని బుట్టలో వేసుకొన్నాడు!

విక్రమ్ కుమార్  ఇదివ‌ర‌కు కూడా హిట్టు సినిమాలు తీశాడు. బాలీవుడ్ స్థాయిలో ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. అయితే `మ‌నం` త‌ర్వాతే ఆయ‌న పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రతి ఒక్కరూ `మ‌నం` తీసిన ద‌ర్శకుడు ఎవ‌రు? ఆయ‌న ఇదివ‌ర‌కు తీసిన సినిమాలేమిటి? అని ఆరా తీయ‌డం క‌నిపిస్తోంది. `మ‌నం` ప్రేక్షకుల ముందుకొచ్చాక ఆయ‌నకి చిత్ర ప‌రిశ్రమ నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. చిరంజీవి మొద‌లుకొని యంగ్‌స్టార్స్ వ‌ర‌కు ఎంతో మంది ఫోన్లు చేసి అభినందించారు.

`మీతో సినిమా చేయ‌డానికి రెడీ` అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే విక్రమ్ మాత్రం మ‌హేష్‌పై గురిపెట్టాడు. ఇటీవ‌లే మ‌హేష్‌కి త‌గ్గ క‌థ‌ని త‌యారు చేసుకొని వెళ్లి వినిపించాడ‌ట‌. మ‌హేష్ ఆ క‌థ విని క్లీన్ బౌల్డ్ అయ్యాడ‌ట‌. మ‌నం సినిమా చేస్తున్నాం అని హామీ ఇచ్చాడ‌ట‌. వ‌చ్చే యేడాది ఈ కాంబినేష‌న్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇదివ‌ర‌కు పేరున్న క‌థానాయ‌కులకు క‌థ‌లు వినిపించాలంటే విక్రమ్ చాలా క‌స‌ర‌త్తులు చేయాల్సి వ‌చ్చేది. నాగార్జున‌కి క‌థ వినిపించ‌డానికి కూడా నితిన్ వాళ్ల నాన్న రెక‌మెండేష‌న్‌తో వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ మ‌నం విడుద‌ల‌య్యాక విక్రమ్‌కి క‌థానాయ‌కులు రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికింత‌న ప‌ని చేస్తున్నారు. ద‌మ్మున్న సినిమా తీస్తే అలా ఉంటుంది మ‌రి. అన్నట్టు మ‌హేష్‌తో విక్రమ్ తీయ‌బోయే సినిమా ఎలా ఉంటుంద‌న్న విష‌యం ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English