గవర్నర్ గిరీల తకరారు

 గవర్నర్ గిరీల తకరారు

బిజేపిలోని చాలా మంది సీనియర్ లీడర్లు ఇప్పుడు గవర్నర్ గిరీలపైనే ఆశలు పెట్టుకున్నారు.  వారికి పదవులు దక్కుతాయా, మోడి సాహసించి తన వారికి పదవులు కట్టబెడతాడా... అన్న టాక్ నడుస్తోంది. చాలా మంది సీనియర్ బిజేపి నేతలు మాత్రం మోడి నిర్ణయంపైనే ఆశలు పెట్టుకున్నారు. కారణం రాకరాక మరోసారి పదేళ్ల తర్వాత బిజేపి కేంధ్రంలో అదికారంలోకి వచ్చింది. బిజేపిలో చాలా మంది సీనియర్ లీడర్లు పార్టీ పుట్టినప్పటినుంచి కష్టపడుతున్నా కూడా చక్కటి అధికార పదవులు అనుభవించని వారున్నారు.. మరో అయిదేళ్ల తర్వాత రాజకీయంగా రిటైర్మంట్ తీసుకునే పరిస్థితుల్లో కూడా మరి కొందరున్నారు. ఇలాంటి వారు గవర్నర్ పదవులపైనే ఆశపడి ఎదరుచూస్తున్నారు.
 కొందరు సీనియర్లకు టికెట్లు ఇచ్చే అవకాశం లేక పదవులకు దూరమయ్యారు. మరి కొందరు పోటీ చేసినా గెలవలేక పదవులకు దూరమయ్యారు. వెంకయ్యనాయుడు వంటి వారికి మంత్రి పదవులు దక్కినా మోడీకి వారణాసిని వదులుకున్న మురళీ మనోహర్ జోషి పరిస్థితి ఏంటి. యశ్వంత్ సిన్హా,వి.కే మల్హోత్రా వంటి వారెందరో ఉన్నారు. వీరంతా గవర్నర్ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. కాని అయిదేళ్లలోపు పదవీ కాలం పూర్తిచేయని గవర్నర్లను  తొలగించే పరిస్థితి లేదు. 2004లో యూపిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకు ముందు బిజేపి వారు నియమించిన ఉత్తరప్రదేశ్, హర్యానా,గుజరాత్ , గోవా రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది. అయితే వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 దీంతో సుప్రీం యూపిఏ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. గవర్నర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని పేర్కొంది. ఏ కారణం లేకుండా తొలగించే అధికారం కేంద్ర సర్కారుకు లేదంది. అయితే కాస్తా ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఏదైనా కచ్చితమైన కారణం ఉంటే మంత్రి మండలి సదరు గవర్నర్ ను తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. దానిని ఆమోదించడం, ఆమోదించకపోవడం పూర్తిగా రాష్ట్రపతి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి నిరాకరిస్తే మాత్రం సర్కారు ఏమి చేయలేదు. ఇక అయిదేళ్ల లోపు పదవి కాలంలో ఉన్న గవర్నర్లనైనా రాష్ట్రపతి తొలగించవచ్చు, కాని కచ్చితమైన కారణం మాత్రం ఉండాలి.

 అయితే తెలంగాణ వంటి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి నరసింహన్ నియామకం జరిగి నెలరోజులు కాలేదు. అంతే కాదు.కేరళకు షీలా దీక్షిత్ నియామకం జరిగి ఏడాదిలోపే అవుతోంది. ఇలా బీహార్,ఒడీషా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్,మేఘాలయా,సిక్కిం, త్రిపుర,నాగాలాండ్ లకు గవర్నర్లను నియమించి ఏడాది, ఆలోపే అవుతోంది. ఇక రెండు మూడేళ్ల లోపు పదవి కాలం అయిన గవర్నర్ల సంఖ్య కూడా బాగానే ఉంది. గోవా, జార్ఖండ్, మద్యప్రదేశ్,మిజోరాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇక అయిదేళ్లు పూర్తయినా కూడా తొలగించాలంటే రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. కేంద్రం తొలగించమని సిఫార్సు మాత్రమే చేయవచ్చు. దానిని ఆమోదించాల్సిన అవసరం రాష్ట్రపతికి లేదు. కాని ఇలా ఇప్పటివరకు జరగలేదు.

 ఇక అయిదేళ్లు పూర్తి చేసుకున్న గవర్నర్ల సంఖ్య కూడా చాలానే ఉంది. ఆంద్రప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ అయిదేళ్లు పూర్తిచేసుకున్నారు. అంటే ఏపలో టిడిపికోసం బిజేపి తన వారిని గవర్నర్ గా నియమించే అవకాశాలున్నాయన్న మాట. అలాగే అస్సాం, చత్తీస్ ఘడ్, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాళ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ము కాశ్మీర్ లు ఉన్నాయి. మోడి వీరిని మాత్రమే ఇంటికి పంపి తన వారిని నియమిస్తారా, లేక కాంగ్రెస్ నియమించిన గవర్నర్లందరిని తొలగించి తన వారిని భర్తీచేసే సాహసం చేస్తారా అన్న ఆసక్తి  నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English