కుర్రోడిలో అంత 'సత్తా' ఉందా?

కుర్రోడిలో అంత 'సత్తా' ఉందా?

    మహేష్‌బాబు బావమరిది సుధీర్‌బాబు హీరో అయితే అయ్యాడు కానీ ఇంకా నటుడిగా ఎలాంటి ఇంప్రెషన్‌ వేయలేదు. 'ప్రేమకథా చిత్రమ్‌' విజయం సాధించినా కానీ దాని వల్ల సుధీర్‌కి వచ్చిందేమీ లేదు. ప్రేమకథా చిత్రమ్‌ తర్వాత మాస్‌ సినిమా చేసి బొక్క బోర్లా పడ్డ సుధీర్‌ తనకి ఎలాంటి సినిమాలు కరెక్టో, ఏమి చేస్తే చూస్తారో అర్థం కాక కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించే చిత్రంలో హీరోగా నటించాలని చూస్తున్నాడు. బ్యాడ్మింటన్‌ ఆటగాడు పుల్లెల గోపీచంద్‌ కథలో సినిమాగా సక్సెస్‌ అయ్యే కమర్షియల్‌ స్టఫ్‌ ఉందో లేదో పక్కన పెడితే ఇలాంటి బయో పిక్స్‌లో నటించడం అంత తేలికేమీ కాదు. సుధీర్‌బాబుకి ఉన్న అంతంతమాత్రం టాలెంట్‌తో దీనిని నెగ్గుకురావడం కష్టమే. అయినా కానీ ఇది చేయడానికే మొగ్గు చూపుతోన్న సుధీర్‌ విమర్శకులకి తగిన సమాధానాన్ని ఈ చిత్రంతో ఇవ్వగలడో లేదో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు