రాణా... చరిత్ర తెలుసుకోమ్మా!

రాణా... చరిత్ర తెలుసుకోమ్మా!

    తెలుగు హీరోలు గతంలో బాలీవుడ్‌లో నటించారు, హిట్లిచ్చారు. కానీ వారిలో ఎవరికీ అక్కడ పర్మినెంట్‌ చోటు దక్కలేదు. హీరోయిన్ల విషయంలో ఉదారంగా ఉండే బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ హీరోల మేటర్‌లో మాత్రం సౌత్‌ని అంతగా లెక్క చేయదు. కమల్‌, రజనీ, చిరంజీవి వంటి హేమాహేమీలే బాలీవుడ్‌ మాకొద్దని తప్పుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ చరిత్ర అంతా తనకి తెలుసో లేదో కానీ బాలీవుడ్‌ వెళ్లి పొడిచేద్దామని దగ్గుబాటి రాణా అనుకుంటున్నాడు. ఇప్పటికే రెండు హిందీ సినిమాల్లో నటించినా కానీ అతనికి అక్కడ కలిసి రాలేదు.

త్వరలోనే మరో సోలో సినిమాతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని రాణా అంటున్నాడు. అయితే ఈ సినిమాతో హిట్‌ కొట్టినా కానీ రాణాకి అక్కడ ప్లేస్‌ గ్యారెంటీ లేదు. తన అంకుల్‌ నాగార్జున, బాబాయ్‌ వెంకటేష్‌ల బాలీవుడ్‌ అనుభవాలని చూసి అయినా రాణా చరిత్రని అర్థం చేసుకుని హిందీ ఫీల్డుని లైట్‌ తీసుకుంటే మంచిదని శ్రేయోభిలాషులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English