అన్నయ్యకి హామీ ఇచ్చేసిన ఎన్టీఆర్‌!

అన్నయ్యకి హామీ ఇచ్చేసిన ఎన్టీఆర్‌!

అన్నదమ్ములు ఒక‌రి చేతిలో మ‌రొక‌రు చెయ్యేసుకొని మీడియా కంట ప‌డినప్పుడే అర్థమైంది. వీరి బంధం బాగా ధృడమైపోయింద‌ని! అనుకొన్నట్టుగానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న అన్నయ్య క‌ల్యాణ్‌రామ్ సంస్థలో సినిమా చేయ‌డానికి ప‌చ్చజెండా ఊపేశాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వం వ‌హించ‌బోతున్న ఆ సినిమాకి అన్నీ సిద్ధమైపోయాయి. ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడం త‌ప్ప‌. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాని రేపే ప్రారంభించ‌బోతున్నారు.

 ఆ చిత్రం త‌ర్వాత వ‌క్కంతం వంశీ  సినిమాకి డేట్లు కేటాయించ‌బోతున్నారు ఎన్టీఆర్‌. త‌న తాత‌గారి పేరుమీద స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో నంద‌మూరి క‌థానాయ‌కులంద‌రిచేతా సినిమాలు చేయించాల‌ని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాడు క‌ల్యాణ్‌రామ్‌. కానీ ఇన్నాళ్లు ఎవ్వరూ కూడా డేట్లు ఇవ్వలేదు. ఇట‌వ‌ల ఎన్టీఆర్  ముందుకొచ్చి సినిమా చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. దీంతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టాడు క‌ల్యాణ్‌రామ్. ఎన్టీఆర్ ఎప్పుడంటే అప్పుడు సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధమ‌య్యాడు క‌ల్యాణ్‌రామ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English