ఆమె బాలకృష్ణతోను ఒక రౌండేసేస్తే..

ఆమె బాలకృష్ణతోను ఒక రౌండేసేస్తే..

    పదేళ్లకి పైగా తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన త్రిష ఇప్పటికీ యువ తారలతో పోటీ పడాలని చూస్తోంది. పెళ్లి చేసుకోవడానికి కూడా ససేమీరా అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వెయిట్‌ చేసినందుకు త్రిషకి ఇప్పుడు బాగానే వర్కవుట్‌ అవుతున్నట్టుంది. రీసెంట్‌గా ఆమెకి తమిళంలో రెండు కొత్త చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. లేటెస్ట్‌గా బాలకృష్ణ సరసన గాడ్సేలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. బాలకృష్ణతో తప్ప ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరితో నటించిన త్రిష ఇప్పుడు బాలయ్యతోను ఒక రౌండ్‌ వేసేస్తే... ఆల్‌ రౌండర్‌ అయిపోతుంది.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ.. ఇలా అందరితో నటించేసింది కానీ త్రిష ఇన్నాళ్లలో బాలయ్యతో మాత్రం నటించలేదు. ఆ లోటు ఇప్పుడు తీరిపోతోంది. శ్రియ తప్ప మిగతా ఏ ఒక్కరికీ ఈ రికార్డు దక్కలేదు. మొత్తానికి బాలకృష్ణతో ఇప్పటికి నటిస్తూ త్రిష కూడా ఆ ఒక్క వెలితినీ పూడ్చేసుకుంటోంది. లెజెండ్‌లోనే అవకాశం వచ్చినా కానీ నటించలేకపోయిన త్రిష ఈసారి మాత్రం ఛాన్స్‌ మిస్‌ చేసుకోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English