మిస్ ఇండియాతో క‌ళ్యాణ్‌రామ్?

మిస్ ఇండియాతో క‌ళ్యాణ్‌రామ్?

నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్‌రామ్ ఇటీవ‌ల వెంట వెంట‌నే రెండు సినిమాలు ప్రారంభించాడు. `ఓమ్‌` త్రీడీ చిత్రంతో ఎదురైన ప‌రాజ‌యం నుంచి తేరుకొని ఒక్కసారిగా రెండు ప్రాజెక్టుల‌ను ప‌ట్టాలెక్కించాడు. ఎలాగైనా ఈ రెండు సినిమాల‌తో విజ‌యాలు అందుకోవాల‌ని క‌ళ్యాణ్‌రామ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.  ఇటీవ‌లే ఆ సినిమాలు ప్రారంభ‌మ‌య్యాయి. వీటిలో  న‌టించ‌డానికి ఆయ‌నకి ఇద్దరు హీరోయిన్లు కావాలి. అందుకోసం క‌ళ్యాణ్‌రామ్ కొన్నాళ్లుగా వేట సాగిస్తున్నాడు. తాజాగా ఓ చిత్రానికి క‌థానాయిక దొరికిన‌ట్టు తెలుస్తోంది. మిస్ ఇండియా వ‌న్య మిశ్రాని `షేర్‌` చిత్రం కోసం ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

2012లో మిస్ ఇండియాగా ఎంపికైంది వ‌న్యమిశ్రా. ఆమె ప్రస్తుతం ఇంజ‌నీరింగ్ చ‌దువుకొంటోంది.  క‌ళ్యాణ్‌రామ్‌, వ‌న్యమిశ్రాల‌పై ఫొటోషూట్ చేశార‌ట‌. ఇద్దరి జోడీ బాగుంద‌ని చిత్రబృందం వ‌న్యమిశ్రాని ఎంపిక చేసింద‌ట‌. త్వర‌లోనే ఈ జంట సెట్స్‌పైకి అడుగుపెడుతుంది. `క‌త్తి` ఫేమ్ మ‌ల్లిఖార్జున్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కబోతోందీ సినిమా. అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న `ప‌టాస్`లో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English