కోటికి తెగ్గొట్టిన త్రిష‌!

కోటికి తెగ్గొట్టిన త్రిష‌!

వెట‌ర‌న్ భామ‌లకి ఇటీవ‌ల బాగా క‌లిసొస్తున్నట్టుంది. ప‌న్నెండేళ్లుగా చిత్ర ప‌రిశ్రమ‌లో కొన‌సాగుతున్న శ్రియ  `మ‌నం`లో నాగార్జున ప‌క్కన న‌టించి మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. ఇప్పుడు త్రిష‌కి కూడా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. బాల‌కృష్ణతో క‌లిసి న‌టించే అవ‌కాశాన్ని ఆమె చేజిక్కించుకుంది. స‌త్యదేవా అనే ఓ కొత్త ద‌ర్శకుడు బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్కించ‌బోతున్నారు. అందులో క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంచుకొన్నారు.  కోటి రూపాయ‌ల పారితోషికం ఇస్తూ ఆమెని ఎంపిక చేశార‌ని తెలిసింది. తొలుత నిర్మాత‌లు సంప్రదించిన‌ప్పుడు త్రిష కోటిన్నర అడిగింద‌ట‌. చివ‌రికి కోటికి ఓకే చెప్పింద‌ట‌.

న‌వ‌త‌రం భామ‌ల‌తో పోటీ ప‌డుతూ త్రిష కోటి తీసుకొంటుండ‌టం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలకృష్ణ‌, త్రిష క‌లిసి ఎప్పుడో న‌టించాల్సింది, కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌వ‌ల్ల కుద‌ర‌లేదు. కాస్త ఆల‌స్యమైనా  ఎట్టకేల‌కు  ఈ జంట‌ని తెర‌పై చూసే అవ‌కాశం క‌లిగింది అభిమానుల‌కు. బాల‌య్య కోరిక మేర‌కే త్రిష‌ని ఇందులో ఎంపిక చేశార‌ని స‌మాచారం. ఆమె చేతిలో సినిమాలేమీ లేక‌పోయినా ఇంత భారీగా పారితోషికం ఇస్తుండ‌టానికి కార‌ణం అదేన‌ట‌. ఈ చిత్రం జూన్ 2న హైద‌రాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English