పవన్‌ గూట్లో చిరంజీవి చిలక!

పవన్‌ గూట్లో చిరంజీవి చిలక!

    పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోను సత్తా చాటుకోవడంతో అతని తదుపరి చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. గబ్బర్‌సింగ్‌ 2 సినిమా ఉఎప్పుడు వచ్చినా కానీ గబ్బర్‌సింగ్‌కి చేసిన దానికి డబుల్‌ రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. ఇంకా మొదలైనా కాకముందే పవన్‌ వల్ల ఈ చిత్రంపై క్రేజ్‌ పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' సినిమాలోని 'చిలుకా క్షేమమా' పాట రీమిక్స్‌ చేయనున్నట్ట్టు తెలిసింది.

చిరంజీవి ఆల్‌టైమ్‌ హిట్స్‌లో ఒకటైన ఈ పాటంటే పవన్‌కళ్యాణ్‌కి చాలా ఇష్టం. చిరంజీవి పాటల్లో తనకేది ఇష్టమైన పాట అని అడిగితే 'చిలుకా క్షేమమా' గురించి పలుమార్లు పవన్‌ చెప్పాడు. ఇప్పుడా పాటని దేవిశ్రీప్రసాద్‌ చేత రీమిక్స్‌ చేయించుకుని తన ఇష్టాన్ని మరోసారి చాటుకుంటున్నాడు. పవన్‌ సినిమాల్లో రీమిక్స్‌, ఇంగ్లీష్‌ పాటలుంటే అవి హిట్‌ అయిన సందర్భాలెక్కువగా ఉన్నాయి. పైగా ఈ పాట పెట్టుకుంటే... అన్నయ్యపై కోపంగా ఉన్నాడనే టాక్‌కి కూడా తెర వేయవచ్చుననేది పవన్‌ ఫీలింగ్‌ ఏమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు