జూ|| ఇలియానా శని వదిలిస్తుందా?

జూ|| ఇలియానా శని వదిలిస్తుందా?

    శని ప్రభావమో ఏమో కానీ హీరో నాని ఇప్పుడు అదే పనిగా ఫ్లాపులు చవిచూస్తున్నాడు. ఈ పరాజయాల పరంపరకి బ్రేక్‌ ఎలా వేయాలో తెలీక సతమతమవుతున్నాడు. అతని సినిమాలపై జనానికి ఎంత ఇంట్రెస్ట్‌ చచ్చిపోయిందంటే.. రిలీజ్‌కి రెడీగా ఉన్నా కానీ జెండాపై కపిరాజుని ఎవరూ కొననంత!

ఇక ఇలాంటి టైమ్‌లో నానికి కొత్త అవకాశాలు రావడమే ఎక్కువనుకోవాలి. రాక రాక నానికి ఇంకో అవకాశం వచ్చిందట. పిల్ల జమీందార్‌ దర్శకుడు అశోక్‌ డైరెక్షన్‌లో నాని నెక్స్‌ట్‌ సినిమా చేస్తాడట. ఇందులో కథానాయికగా రెజీనా నటిస్తుంది. జూనియర్‌ ఇలియానాగా కితాబులు అందుకుంటోన్న రెజీనా చిన్న సినిమాలకి పెద్ద హీరోయిన్‌గా చలామణీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెజీనాకి నానితో నటించే అవకాశం రావడమంటే ప్రమోషన్‌ కిందే లెక్క. అయితే ప్రస్తుతం నాని ఉన్న పరిస్థితుల్లో రెజీనానే అతని రాతని మార్చాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English