అంటే రజనీకాంత్‌ ముసలోడు కాదా?

అంటే రజనీకాంత్‌ ముసలోడు కాదా?

    ఫిఫ్టీ దాటిన మన హీరోలతో నటించడానికి కొందరు హీరోయిన్లు ససేమీరా అంటున్నారు. బాగా సీనియారిటీ సంపాదించినా కానీ ఇలియానా, కాజల్‌లాంటి హీరోయిన్లు అగ్ర నటులైన బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జునలకి దూరంగా ఉంటున్నారు. అదే అరవై ఏళ్లు దాటిన అరవ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించడానికి మాత్రం ఎగబడుతున్నారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా రూపొందుతున్న 'లింగా' చిత్రంలో కథానాయికగా సోనాక్షి సిన్హా ఎంపికయ్యే సరికి తెలుగు హీరోలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిండా పాతికేళ్లు లేని ఈ హీరోయిన్లు అరవై దాటిన రజనీతో రొమాన్స్‌కి ఏమాత్రం సంకోచించకపోవడం చూసి అవాక్కవుతున్నారు. రజనీతో ఒక్క సినిమా చేస్తే ఇండియాతో పాటు ఇతర దేశాల్లోను పాపులర్‌ కావచ్చుననే సంగతి తెలియడంతో హీరోయిన్లు రజనీకాంత్‌ ఏజేంటి, గేజేంటి అని చూడ్డం లేదిపుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు