అబ్బే లాభం లేదమ్మా ఎన్టీఆర్‌

అబ్బే లాభం లేదమ్మా ఎన్టీఆర్‌

    'రభస' చిత్రంతో ఎన్టీఆర్‌ ఇండస్ట్రీ హిట్టు కొట్టినా, లేకున్నా... కనీసం యాభై కోట్ల మార్కు అయితే చేరుకుంటాడని, తన స్టామినాని క్వశ్చన్‌ చేస్తున్న వారి నోళ్లు మూయిస్తాడని ఫాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. అయితే రభస టీజర్‌ చూసిన తర్వాత వారి అంచనాల సంగతెలా ఉన్నా కానీ అనుమానాలైతే చాలా మొదలయ్యాయి. చాలా రొటీన్‌గా... ఎలాంటి ఆసక్తి కలగని విధంగా ఈ టీజర్‌ కట్‌ చేసారు. ఈ టీజర్‌లానే సినిమా కూడా రొటీన్‌గా ఉంటే మాత్రం ఎన్టీఆర్‌కి మళ్లీ డిజప్పాయింట్‌మెంట్‌ తప్పదు.

ఎన్టీఆర్‌కి రొటీన్‌ సినిమాలతో వర్కవుట్‌ అవడం లేదని దమ్ము, రామయ్యా వస్తావయ్యా ఫలితాలు తెలియజేసాయి. అయినప్పటికీ ఇంకోసారి ఎన్టీఆర్‌ అలాంటి యాక్షన్‌ సినిమానే చేసి ఉంటాడనుకోలేం. బహుశా టీజర్‌ని హడావుడిగా కట్‌ చేయడం వలన, లేదా ఫాన్స్‌కి నచ్చే ఎన్టీఆర్‌ని చూపించాలనే ఉద్దేశంతో ఇది ఇలా రిలీజ్‌ చేసి ఉండొచ్చు, ఇన్‌సైడర్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ పరంగా అయితే రభసలో కామెడీ చాలా బాగుంటుందట. అదే ఈ చిత్రానికి పెట్టని కోట అని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English