మహేష్‌ ఫాన్స్‌ సపోర్ట్‌ ఉంటుందా?

మహేష్‌ ఫాన్స్‌ సపోర్ట్‌ ఉంటుందా?

చాలా పెద్ద సినిమా ఫ్యామిలీస్‌ నుంచి మల్టిపుల్‌ హీరోలున్నారు కానీ మహేష్‌ మాత్రం తమ కుటుంబం తరఫున ఏకైక హీరో అయిపోయాడు. అందుకే ఆ వెలితిని తగ్గించడానికి కృష్ణ తన అల్లుడు సుధీర్‌ బాబుని హీరోగా పరిచయం చేశారు. కానీ అతని తొలి చిత్రానికి ఫాన్స్‌ నుంచి అంతగా సహకారం లభించలేదు. మహేష్‌కి లక్షలాది మంది అభిమానులున్నారు కానీ అతని బావ మరిది సినిమా చూడ్డానికి వారికి తీరిక చిక్కలేదు. అందుకే సుధీర్‌బాబు ఫస్ట్‌ ఎస్‌ఎంఎస్‌ డెస్టినేషన్‌ రీచ్‌ అవలేదు.

ఈసారి అతను 'ప్రేమకథా చిత్రమ్‌'లో ఒక వెరైటీ రోల్‌ చేశాడు. ఈ చిత్రం ఈవారం రిలీజ్‌ అవుతోంది. బూతు కథా చిత్రాల దర్శకుడనే బ్రాండ్‌ వేయించుకున్న మారుతి ఈ చిత్రానికి కథ, మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. తన సినిమాల మాదిరిగా ఇదిఅడల్ట్‌ కంటెంట్‌ ఉండదని, అచ్చమైన ప్రేమకథా చిత్రమని మారుతి చెబుతున్నాడు. అయితే ఈ చిత్రానికి మహేష్‌ ఫాన్స్‌ నుంచి ఫుల్‌ సపోర్ట్‌ లభిస్తేనే ఇది నిలబడగలుగుతుంది. ఈ చిత్రానికి వారి సహకారం ఎంత ఉంటుందో కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు