రాము కూడా బాగా ఫీలయ్యాడు

రాము కూడా బాగా ఫీలయ్యాడు

వస్తూనే ఆమె ఓ సంచలనం!! 60పైబడిన ముసలాడితో టేకిటీజీ అంటూ..లవ్వాయణం సాగించే టీనేజీ అమ్మాయిగా ‘నిశ్శబ్ధ్‌’ చిత్రంలో నటించి ఔరా అనిపించింది. ఈ అమ్మడి అందచందాలకు, తొణికిసలాడే యవ్వనానికి రావ్‌ుగోపాల్‌వర్మ అంతటివాడే ఫిదా అయిపోయాడు. ఏకంగా ‘నిశ్శబ్ధ్‌’తో జియా ఖాన్‌ ఎలియాస్‌ నఫీసా ఖాన్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేశాడు.

నిశ్శబ్ధ్‌ చిత్రంలో టేిటీజీ ఫిలాసఫీని వాడే అమ్మాయిగా ఈ భామ కనిపించింది. అయితే నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగేలా కనిపించే జియా...అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని ఈ ప్రపంచానికి పెద్ద షాకిచ్చింది. ముంబై జుహూలో ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని తనువు చాలించింది. అయితే దీనికి వర్మ తెగ ఫీలైపోతున్నాడు. సినిమాలో పాత్రలాగే..దేనికీ తలంచక ఉండాల్సింది. జియా సినిమాల్నే ఫాలో అయితే బావుండు అంటున్నాడు. ఇది ఇంతకీ హత్యో, ఆత్మహత్యో ఇంకా ఎవరికీ తెలీనే తెలియదు. ఏదిఏమైనా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు