బాలకృష్ణ హ్యాండా.. మజాకా!

బాలకృష్ణ హ్యాండా.. మజాకా!

   సంపాదించినదంతా జూదంలో పోగొట్టుకుని... చేతిలో అవకాశాలు కూడా లేక ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నాడని జగపతిబాబు గురించి ఒక ఏడాది క్రితి రూమర్‌ స్ప్రెడ్‌ అయింది. అయితే ఏడాది తిరిగేసరికి జగపతిబాబు ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఒకేసారి రెండు కోట్లు తీసుకునే రేంజ్‌ ఆర్టిస్ట్‌ అయిపోయాడు. అతని కెరియర్‌ని ఒకే ఒక్క సినిమా పూర్తిగా తిప్పి పారేసింది. అదే బాలకృష్ణ లెజెండ్‌. ఇందులో విలన్‌గా జగపతిబాబు ప్రదర్శించిన నటన సినిమాకి హైలైట్‌గా నిలిచింది. చిత్ర విజయంలో అతను కూడా కీలక పాత్ర పోషించడంతో జగపతిబాబుకి ఇప్పుడు అవకాశాలు తన్నుకొస్తున్నాయి.

రజనీకాంత్‌ తదుపరి చిత్రం లింగాలో జగపతిబాబు ఒక పవర్‌ఫుల్‌ రోల్‌ కొట్టేసాడు. కన్నడ నటుడు, ఈగ విలన్‌ సుదీప్‌ని ఈ చిత్రంలో తీసుకుందామని అనుకున్నారు కానీ అతను బిజీగా ఉండడంతో ఆ లక్‌ జగపతిబాబుకి దక్కింది. ఒక్కసారి బాలకృష్ణ హ్యాండ్‌ పడగానే జగపతిబాబు సుడి మొత్తం తిరిగిపోయింది. నిజంగా అప్పుడు జూదంలో ఆస్తులు పోగొట్టుకుని ఉంటే... వాటిని మళ్లీ సంపాదించేసుకోవడానికి జగపతిబాబుకి ఇంత కంటే మంచి ఛాన్స్‌ రాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు