హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌తో జోరు తగ్గింది

హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌తో జోరు తగ్గింది

    యువ హీరో రామ్‌ దేవదాస్‌, రెడీ చిత్రాలతో తనకంటూ గుర్తింపుని, పదిహేను కోట్ల మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ 'కందిరీగ'తో హిట్టయ్యాడు. కానీ ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోలేక వరుసగా ఫ్లాపులు చవిచూసాడు. ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలాతో హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ టేస్ట్‌ చేసిన రామ్‌ మార్కెట్‌ బాగా దెబ్బ తింది. అతనిపై ఆడియన్స్‌కి ఉన్న నమ్మకం కాస్త సడలింది.

ఇప్పుడు ఖచ్చితంగా హిట్టిచ్చి మళ్లీ తిరిగి మునుపటిలా విజృంభించాలని చూస్తున్న రామ్‌ 'పండగ చేస్కో' చిత్రాన్ని ఓకే చేసాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంపై అతను చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ దగ్గర్నుంచీ అన్నిట్లోను పాల్గొంటున్నాడు. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ తనకి తానే హిట్టిచ్చుకోవడానికి హండ్రెడ్‌ పర్సెంట్‌ కృషి చేస్తున్నాడు. ఇంత బిజీ టైమ్‌లో ఈ రోజు తన బర్త్‌డేని కూడా చెన్నయ్‌లోనే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌తో జరుపుకుంటున్నాడు. తన ఫ్లాప్‌లకి బ్రేక్‌ వేసి మళ్లీ పండగ చేస్కుంటాడని ఆశిస్తూ రామ్‌కి బర్త్‌డే విషెస్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు