నందమూరి హీరోకి ఊపొచ్చింది

నందమూరి హీరోకి ఊపొచ్చింది

    'ఓం 3డి' ఫలితంతో డిప్రెషన్‌కి లోనయి కొంతకాలం షూటింగులకి దూరంగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ మళ్లీ ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు. ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టేసి... ఎట్‌ ఏ టైమ్‌ రెండు రాళ్లేస్తే ఒక్కటైనా తగలక పోతుందా అని చూస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతని కొత్త చిత్రం 'పటాస్‌' మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా 'షేర్‌' అనే మరో చిత్రాన్ని కళ్యాణ్‌రామ్‌ స్టార్ట్‌ చేసాడు. దీనికి 'అభిమన్యు', 'కత్తి' చిత్రాల దర్శకుడు మల్లిఖార్జున్‌ దర్శకత్వం వహిస్తాడు.

ఈ టైటిల్స్‌ని బట్టి ఇవి రెండూ మాస్‌ మసాలా సినిమాలే అని అర్థమవుతోంది. అతనొక్కడే తప్ప కెరియర్‌లో హిట్లు లేని కళ్యాణ్‌రామ్‌ ఇప్పుడు నందమూరి వంశం బ్రాండ్‌ ఇమేజ్‌నే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం తపించడం కంటే.. మాస్‌ మెచ్చిన సినిమాలు చేసి అదృష్టం కలిసొస్తుందని నమ్మడం బెటర్‌ అనుకుంటున్నాడు. ఫాన్స్‌ కూడా లైట్‌ తీసుకోవడం మొదలు పెట్టాక మళ్లీ కళ్యాణ్‌రామ్‌ పుంజుకుంటాడా? ఓ రకంగా ఇది అతనికి హీరోగా డూ ఆర్‌ డై సిట్యువేషన్‌ కనుక ఈ రెండు సినిమాలు హీరోగా అతని భవిష్యత్తుని డిసైడ్‌ చేస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English