ఎన్టీఆర్‌ హ్యాండ్‌ ఇచ్చాడంట

ఎన్టీఆర్‌ హ్యాండ్‌ ఇచ్చాడంట

 కెరీర్‌ పరంగా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటోన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు ఏది పడితే అది చేసేయడం లేదు. ఎంత పెద్ద దర్శకుడితో అయినా కూడా కథ నచ్చకుండా ఎన్టీఆర్‌ కమిట్‌ అవడం లేదు. అందుకే పూరి జగన్నాథ్‌ సినిమాని ఎన్టీఆర్‌ చేయడం లేదని తెలిసింది. పూరి జగన్నాథ్‌ రెండు వెర్షన్లు కథ వినిపించగా రెండు సార్లూ ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేసాడంట.

 గతంలో తనతో పూరి తీసిన ఆంధ్రావాలా అనుభవం ఎన్టీఆర్‌కి ఇంకా గుర్తుందో ఏమో... అతను చెప్పే సాధారణ కథల్ని ఎన్టీఆర్‌ ఎంటర్‌టైన్‌ చేయడం లేదు. పూరికి కథ మీద ఎక్కువ రోజులు వర్క్‌ చేసే అలవాటు లేదు. ఏదో పైపైన కథ రాసేసుకుని డైలాగులతో మేనేజ్‌ చేసేయాలని చూస్తాడు. అది ఎన్టీఆర్‌ దగ్గర వర్కవుట్‌ అవడం లేదు. ఎన్టీఆర్‌కి ఇప్పుడు ప్రతి సినిమా కీలకం కాబట్టి సాధారణ కథతో సినిమా చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందుకే ఈ చిత్రం ప్రస్తుతానికి అటకెక్కింది. పూరి జగన్‌ సీరియస్‌గా తీసుకుని ఎన్టీఆర్‌ని ఇంప్రెస్‌ చేసి తీరాలి అనుకుంటే తప్ప ఇది మొదలయ్యే సూచనలు లేవు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English